గణపయ్యకు 8వ రోజు నైవేద్యంగా సేమ్యా కేసరి.. ఇలా చేస్తే అదిరిపోతుంది!

Prasanna Yadla

20  september 2026

Pic credit - Pinterest

వినాయకుడిని ప్రతిష్టించి నేటికీ 7 రోజులు.  8 వ రోజు సేమ్యా కేసరి ప్రసాదం ఇలా ఈజీగా చేసి ఆ గణపయ్యకు  నైవేద్యంగా పెట్టండి 

సేమ్యా కేసరి

మరి, లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

తయారీ విధానం

ముందుగా మీరు ఒక కప్పు మంచి  సేమ్యా తీసుకుని  చిన్న కళాయిలో వేసి మీడియం మంటపై దీనిని వేయించుకోవాలి.

స్టెప్ 1 

ఇక ఇప్పుడు సేమ్యా వాసన వచ్చే వరకు కలర్ మారిన తరవాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.

స్టెప్ 2

మళ్ళీ అదే పాన్‌లో కొద్దిగా  నెయ్యి వేసి 10 జీడిపప్పు, 10 కిస్మిస్ కు వేసి వీటిని వేయించి పక్కన పెట్టాలి.

స్టెప్ 3

ఆ తర్వాత మళ్ళీ ఇంకో పాన్‌లో తీసుకుని దానిలో  మూడు  కప్పుల నీళ్లు పోసి వీటిని బాగా  మరిగించాలి.

స్టెప్ 4

ఈ నీళ్లు మరిగిన తర్వాత సేమ్యా వేసి ఉడికిన తర్వాత చక్కెర, నెయ్యి వేసి కలుపుతూ ఉడికించాలి.

స్టెప్ 5

చివరలో యాలకుల పొడి , జీడిపప్పు, కిస్మిస్ వేసి దించి సేమ్యా కేసరిని గణపయ్యకు నైవేద్యంగా పెట్టండి.  

స్టెప్ 6