AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంజీఎంలో భద్రత కరువు..! స్లాబ్ పెచ్చులు ఊడిపడి ముగ్గురికి తీవ్ర గాయాలు!

ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండెకాయ లాంటి వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యత మాట పక్కనబెడితే, అసలు రోగులకు కనీస ప్రాణ భద్రత కరువైందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో చోటుచేసుకున్న ఒక ప్రమాదం రోగులను, వారి బంధువులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. వార్డులోని సీలింగ్ స్లాబ్ పైకప్పు పెచ్చులు ఉన్నట్లుండి ఒక్కసారిగా భారీ శబ్దంతో కిందపడ్డాయి.

ఎంజీఎంలో భద్రత కరువు..! స్లాబ్ పెచ్చులు ఊడిపడి ముగ్గురికి తీవ్ర గాయాలు!
Mgm Hospital Accident
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Sep 20, 2026 | 3:04 PM

Share

ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు ఆరాధ్య దైవంగా భావించే వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆరోగ్యశ్రీ వార్డులోని సీలింగ్ స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడటంతో బెడ్లపై ఉన్న ముగ్గురు రోగులు తీవ్రంగా గాయపడ్డారు. నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం సిద్ధమవుతున్న తరుణంలో, పాత ఎంజీఎం పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆరోగ్యశ్రీ వార్డులోని సీలింగ్ స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడటంతో బెడ్లపై ఉన్న ముగ్గురు రోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆరోగ్యశ్రీ వార్డులో జరిగింది.. ఉదయం స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడి పడ్డాయి.. ఆ పెచ్చులు రోగులపై పడడంతో బెడ్ పై నడవలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ముగ్గురు రోగులకు తీవ్ర గాయాలు అయ్యాయి.. గాయపడ్డ వారిలో పెరాలసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్ (55), అటెండర్స్ ఎల్లమ్మ (50), ఓంకార్ (33) అనే ముగ్గురు ఉన్నారు.

బాధితులు జఫర్గడ్ మండలం ఉప్పుగల్ కి చెందిన వారిగా గుర్తించారు.. తలపగిలి గాయపడిన వారికి ఇదే ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా mgm ఆస్పత్రి సూపరింటెండెండ్ Dr రాంకుమార్ రెడ్డి పరిశీలించారు.. ఈ వార్డులోని రోగులను మరో వార్డుకు షిఫ్ట్ చేశారు.. ఈ బిల్డింగ్ అతి పురాతన భవనం కావడం వల్ల పై పెచ్చులు ఊడిపడి ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు.. త్వరలో 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్న నేపద్యంలో ఈ పేదల పెద్దాసుపత్రిని పూర్తి నిర్లక్ష్యంగా వదిలేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us