AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కింద పడలేదు, గాయం కాలేదు, అయినా కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? అసలు కారణాలు, నివారణ మార్గాలు!

చాలామంది తరచుగా ఫిర్యాదు చేసే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో కాళ్ల నొప్పులు ఒకటి. రోజంతా కష్టపడి పనిచేసినప్పుడు లేదా ఎక్కువ దూరం నడిచినప్పుడు కాళ్లలో నొప్పి రావడం సాధారణమే. అయితే, ఎటువంటి శారీరక శ్రమ లేదా అలసట లేకపోయినా కాళ్లలో విపరీతమైన నొప్పి వస్తుంటే మాత్రం దానిని తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో లోపల దాగి ఉన్న పలు ఆరోగ్య రుగ్మతలకు సంకేతం కావచ్చు.

కింద పడలేదు, గాయం కాలేదు, అయినా కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? అసలు కారణాలు, నివారణ మార్గాలు!
Leg Pain Causes
Jyothi Gadda
|

Updated on: Sep 20, 2026 | 12:32 PM

Share

చాలామంది తరచుగా ఫిర్యాదు చేసే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో కాళ్ల నొప్పులు ఒకటి. రోజంతా కష్టపడి పనిచేసినప్పుడు లేదా ఎక్కువ దూరం నడిచినప్పుడు కాళ్లలో నొప్పి రావడం సాధారణమే. అయితే, ఎటువంటి శారీరక శ్రమ లేదా అలసట లేకపోయినా కాళ్లలో విపరీతమైన నొప్పి వస్తుంటే మాత్రం దానిని తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో లోపల దాగి ఉన్న పలు ఆరోగ్య రుగ్మతలకు సంకేతం కావచ్చు.

తరచూ ఎటువంటి తీవ్రమైన అలసట లేదా శారీరక శ్రమ లేకుండానే కాళ్లలో విపరీతమైన నొప్పి వస్తుంటే దానిని సాధారణ విషయంగా కొట్టిపారేయకండి. ఇది శరీరంలో దాగి ఉన్న పలు ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నొప్పులను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వైద్యులను సంప్రదించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే తీవ్ర సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చునని చెబుతున్నారు. పూర్తి డిటెల్స్‌లోకి వెళితే..

కాళ్ల నొప్పులకు ప్రధాన కారణాలు:

విటమిన్లు, ఖనిజాల లోపం: శరీరంలో విటమిన్ డి విటమిన్ బి12 లోపించినప్పుడు ఎముకలు, నరాలు బలహీనపడి కాళ్లలో నొప్పి వస్తుంది. అలాగే పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి అవసరమైన ఎలక్ట్రోలైట్లు తగ్గినప్పుడు కండరాలు పట్టివేయడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

డిహైడ్రేషన్: శరీరానికి సరిపడా నీరు అందకపోతే కండరాలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల రాత్రి పూట పడుకున్నప్పుడు కాళ్లలో తిమ్మిర్లు, విపరీతమైన నొప్పి వస్తుంటాయి.

రక్త ప్రసరణ సమస్యలు: కాళ్లకు రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం లేదా డీప్ వేన్ థ్రోంబోసిస్ వంటి సమస్యల వల్ల సిరల్లో రక్తం గడ్డకడుతుంది. దీనివల్ల కాళ్లలో వాపు, నొప్పి ఏర్పడతాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి.

నరాల సమస్యలు: వెన్నుముక క్రింది భాగంలో ఉండే సియాటిక్ నరంపై ఒత్తిడి పడినప్పుడు ఆ నొప్పి నడుము నుండి తొడలు, పిక్కల ద్వారా కాళ్ల చివరి వరకు వ్యాపిస్తుంది. దీనివల్ల కాళ్లలో మంటలు, తిమ్మిర్లు, నొప్పి వస్తాయి.

డయాబెటిక్ నూరోపతి : రక్తంలో చక్కెర స్థాయిలు సుదీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉంటే కాళ్లలోని నరాలు దెబ్బతింటాయి. దీనివల్ల ఏ కారణం లేకుండానే కాళ్లలో సూదులతో గుచ్చినట్లు లేదా తీవ్రమైన నొప్పి వస్తుంది.

నివారణ మార్గాలు, జాగ్రత్తలు:

రోజూ సరిపడా నీరు (3-4 లీటర్లు) తాగుతూ ఉండాలి.

పోషకాలు కలిగిన ఆహారం, ముఖ్యంగా ఆకుకూరలు, పాలు, గుడ్లు, పండ్లు తీసుకోవాలి.

ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం లేదా నిలబడటం చేయకూడదు. మధ్యమధ్యలో చిన్నపాటి విరామం తీసుకోవాలి.

ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలు లేదా వాకింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

కాళ్ల నొప్పులు వరుసగా కొన్ని రోజుల పాటు వేధిస్తున్నా, లేదా నొప్పితో పాటు వాపు, ఎరుపుదనం, కాలు మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే అర్హులైన వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us