AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్కారు బడిలో రోబో టీచర్‌.. సమాధానాలు మామూలుగా లేవుగా..

సిరిసిల్ల సర్కారు బడిలో రోబో టీచర్‌.. విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు, వారి సందేహాలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇస్తోంది. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌ ఆధారంగా పనిచేస్తున్న ఈ టీచర్‌ విద్యార్థులను ఆకట్టుకుంటోంది. సాధారణ టీచర్లకు భిన్నంగా టెక్నాలజీతో బోధన సాగుతుండటంతో ఈ కొత్త విధానం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రోబో సమాధానాలు వింటే నిజంగానే ఆశ్చర్యపోవాల్సిందే!

సర్కారు బడిలో రోబో టీచర్‌.. సమాధానాలు మామూలుగా లేవుగా..
Robot Teacher In Siricilla
G Sampath Kumar
| Edited By: |

Updated on: Sep 20, 2026 | 11:30 AM

Share

ప్రభుత్వ పాఠశాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినూత్నంగా వినియోగిస్తూ చేపట్టిన ప్రయోగం అందరినీ ఆకట్టుకుంది. సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో రోబో టీచర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండస్‌ ల్యాబ్‌ సంస్థ పాఠశాలకు బహూకరించిన రోబో టీచర్‌ తొలిసారిగా తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి వారి ప్రశ్నలకు సమాధానాలు అందరినీ ఆకట్టుకుంది. పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థుల ప్రగతి, సాంకేతికత వినియోగం తదితర అంశాలపై తల్లిదండ్రులు రోబో టీచర్‌ను పలు ప్రశ్నలు అడిగారు. రోబో టీచర్‌ సాంకేతిక పరిజ్ఞానంతో వాటికి స్పష్టమైన సమాధానాలు ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆసక్తిగా గమనించారు. సాధారణంగా ఉపాధ్యాయులతో నిర్వహించే సమావేశానికి భిన్నంగా రోబోతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది.

విద్యార్థులకు పాఠ్యాంశాలను మరింత ఆసక్తికరంగా, సులభంగా అర్థమయ్యేలా చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలనే ఉద్దేశంతో రోబో టీచర్‌ను పాఠశాలలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా సాంకేతికత ఆధారిత బోధనపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది.

వీడియో చూడండి..

రోబో టీచర్‌ నేరుగా మాట్లాడటం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆధునిక సాంకేతికతకు చోటు కల్పిస్తూ విద్యాబోధనలో కొత్త విధానాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సర్కారు బడిలో రోబో టీచర్‌.. సమాధానాలు మామూలుగా లేవుగా..
సర్కారు బడిలో రోబో టీచర్‌.. సమాధానాలు మామూలుగా లేవుగా..
3-0తో గెలిచినా టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. నంబర్ 1 ప్లేస్ మిస్
3-0తో గెలిచినా టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. నంబర్ 1 ప్లేస్ మిస్
పొటాషియం అధికంగా ఉంటే 5 రకాల ఆహారాలు ఇవే!
పొటాషియం అధికంగా ఉంటే 5 రకాల ఆహారాలు ఇవే!
ఆ హీరోను కానీ చూడగానే దండం పెట్టాలనిపిస్తుది.. తనికెళ్ల భరణి..
ఆ హీరోను కానీ చూడగానే దండం పెట్టాలనిపిస్తుది.. తనికెళ్ల భరణి..
తెలుగు మన వెలుగు.. తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ సభ జరగాల్సిందే..
తెలుగు మన వెలుగు.. తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ సభ జరగాల్సిందే..
ఇంటిగోడలపై మెలిచే ఈ మొక్కలను ఇలా సింపుల్‌గా తొలగించండి!
ఇంటిగోడలపై మెలిచే ఈ మొక్కలను ఇలా సింపుల్‌గా తొలగించండి!
అదృష్ట రాశులు ఇవే.. వీరి జీవితాల్లో గొప్ప మలుపు
అదృష్ట రాశులు ఇవే.. వీరి జీవితాల్లో గొప్ప మలుపు
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి: మీ శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదంటే
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి: మీ శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదంటే
2 ఫోర్లు, 5 సిక్స్‌లతో లేడీ సెహ్వాగ్ దూకుడు.. 24 బంతుల్లోనే హాఫ్
2 ఫోర్లు, 5 సిక్స్‌లతో లేడీ సెహ్వాగ్ దూకుడు.. 24 బంతుల్లోనే హాఫ్
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 7 రోజులలో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 7 రోజులలో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు