Love Story: కేరళలో వింత ప్రేమకథ.. పదేళ్లుగా ఒకే గదిలో.. పారిపోయిన యువతి.. ఆమె ఎక్కడ ఉందంటే..?

Kerala Love Story: కేరళలో వింత ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. పదేళ్ల క్రితం బాలిక ఇంటినుంచి పారిపోయింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఆ బాలిక ఇంటికి సమీపంలోనే

Love Story: కేరళలో వింత ప్రేమకథ.. పదేళ్లుగా ఒకే గదిలో.. పారిపోయిన యువతి.. ఆమె ఎక్కడ ఉందంటే..?
Woman
Follow us

|

Updated on: Jun 10, 2021 | 2:08 PM

Kerala Love Story: కేరళలో వింత ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. పదేళ్ల క్రితం బాలిక ఇంటినుంచి పారిపోయింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఆ బాలిక ఇంటికి సమీపంలోనే ఓ యువకుడి ఇంట్లో నివసిస్తోంది. అయితే ఆమె నివసిస్తున్న సంగతి ఆ యువకుడి ఇంట్లో వారికి కూడా తెలీదు. ఈ వింత ప్రేమకథ కేరళలోని పాలక్కడ్‌ జిల్లా నెమ్మర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అయిరూర్‌ గ్రామానికి చెందిన ఓ బాలిక (18) 2010 ఫిబ్రవరిలో ఇంటి నుంచి పారిపోయింది. గత పదేళ్లుగా ఆమె ఎక్కడుందో ఇంట్లోవాళ్లకు తెలియలేదు. ఆమెకోసం వెతికినా.. జాడ తెలియకపోవడంతో వారు ఆశలు వదులుకున్నారు. తీరా పదేళ్ల తర్వాత బయటపడ్డ విచిత్రం ఏమిటంటే.. ఆ బాలిక ఇంటికి సమీపంలో ఉన్న ఓ అబ్బాయి ఇంటి దగ్గరే ఆమె ఉంటోంది. ఇందులో మరో విశేషం ఎంటంటే.. ఆమె అక్కడున్న విషయం అబ్బాయి ఇంట్లోవారికి కూడా తెలియదు.

గత పదేళ్లుగా ఆ యువతి తాళం వేసి ఉన్న ఓ గదిలో నివసిస్తోంది. ఆమె ప్రేమికుడిగా చెబుతున్న యువకుడే యోగక్షేమాలు చూసుకునేవాడని నెమ్మర పోలీసులు తెలిపారు. ఆ గదిలో బాత్‌రూం కూడా లేదని.. గదికి ఉన్న ఓ కిటికీ ద్వారా రాత్రిపూట ఆమె బయటకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకునేది. పగటిపూట ఆ కిటికీ కూడా మూసి ఉండేది. ఆమెకు ఆహారం, ఇతర సదుపాయాలన్నీ యువకుడు సమకూర్చేవాడు. తర్వాత బయటి నుంచి తాళం వేసే వాడు. ఇలా పదేళ్లు గడిచాయి. మూడు నెలల కిందట.. ఆ యువకుడు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో గత పదేళ్లుగా జరుగుతున్న తతంగం బయటపడింది. అద్యశ్యమైంది ఒకరు కాదు.. ప్రేమికులిద్దరూ అని పోలీసుల విచారణలో బయటపడింది. వారిద్దరూ కలిసి నెమ్మర సమీపంలోని కుగ్రామం విథాన్‌స్సెరీలో ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. యువకుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు.. ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. తాము కలిసి జీవించాలని అనుకొంటున్నట్లు యువతి కోర్టుకు తెలపడంతో ప్రేమికుడితో వెళ్లేందుకు ఆమెను న్యాయమూర్తి అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే ఈ నిర్ణయానికి ప్రేమికులిద్దరి కుటుంబసభ్యులు వ్యతిరేకించలేదని పోలీసులు తెలిపారు.

Also Read:

Seema Patil: ఆమె జీతం రూ.100 కోట్లు.. ట్రెండింగ్ కంపెనీలకు రోల్‌మోడల్.. జీరోధా కంపెనీ డైరెక్టర్

Fuel price today: తగ్గేదేలే..! దూసుకుపోతున్న పెట్రో ధరలు.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో