COVID Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న చోట బల్బ్ పెడితే వెలుగుతున్న వైనం.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం

COVID Vaccine: కోవిడ్ కల్లోలం నుంచి అందరూ పయటపడాలన్నా.. సురక్షితంగా జీవించాలన్నా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ను తప్పక వేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి...

COVID Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న చోట బల్బ్ పెడితే వెలుగుతున్న వైనం.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం
Electric Bulbs
Follow us
Surya Kala

|

Updated on: Jun 10, 2021 | 2:37 PM

COVID Vaccine: కోవిడ్ కల్లోలం నుంచి అందరూ పయటపడాలన్నా.. సురక్షితంగా జీవించాలన్నా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ను తప్పక వేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. కరోనా వైరస్ నుంచి రక్షణ ఇచ్చే రోగ నిరోధక శక్తి వ్యాక్సిన్లు ఇస్తాయని.. యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. టీకా వేయించుకున్న తర్వాత కొంతమందికి తలనొప్పి, జ్వరం వంటి చిన్న చిన్న మైనర్ ఇబ్బందులు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఓ ఇద్దరికి మాత్రం టీకా వేయించుకున్న అనంతరం శరీరం విద్యుత్ కేంద్రంగా మారింది. వ్యాక్సిన్ వేయించుకున్న చోట బల్బ్ పెడితే.. అది వెలుగుతుంది. ఈ వింత సంఘటన కర్ణాటక లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

హుబ్లీ కి చెందిన సుమంత్, దీక్ష అన్నాచెల్లెళ్లు. వీరిద్దరూ ఇటీవల కోవిడ్ వ్యాక్సిన్లు వేయించుకున్నారు. తర్వాత సుమంత్ ఓ ఎల్‌ఈడీ బల్బుతో ప్రయోగాలు చేస్తూ.. అనుకోకుండా టీకా వేయించుకున్న భుజం మీద ఆ బల్బ్ ను పెట్టాడు. వెంటనే అది స్విచ్ ఆన్ చేసినట్లు వెలిగి.. ఇల్లంతా కాంతులు పంచింది. అది చూసిన కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. అయితే సుమంత్ ఆ బల్బ్ ను తన శరీరం మీద ఇతర భాగాల పై పెట్టి చూశాడు..అది వెలగలేదు.. మళ్ళీ వ్యాక్సిన్ వేయించుకున్న చోట పెట్టాడు.. అప్పుడు మళ్ళీ బల్బ్ వెలిగింది. అన్న చూసిన దివ్య కూడా తన శరీరం పై ప్రయోగం చేసింది. దివ్య కు కూడా టీకా వేయించుకున్న చోట బల్బ్ పెడితే వెలుగుతుంది. దీంతో వీరిద్దరూ బల్బ్ ను వెలిగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వైరల్ అయింది. అయితే ఈ వింతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఇది వింత కాదు పబ్లిసిటీ స్టంట్ అంటుంటే.. మరికొందరు బల్బ్ రిమోట్‌తో ఆపరేట్ చేయగలిగే చార్జింగ్ బల్బు అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది అసలు కరోనా టీకాకు కరెంట్ కు సంబంధం ఏమిటి.. ఇదంతా ఫేక్ అంటూ రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: హెల్మెట్ ను ఆహారం అనుకుని తినడానికి ప్రయత్నించిన ఏనుగు.,. వీడియో వైరల్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!