Fact Check: ఇదేం వింత గురూ.. రావి చెట్టుకు మామిడికాయలు.. అసలు విషయం ఇది
రావిచెట్టుకు మామిడికాయలు కాయడంతో అందరూ నివ్వెరపోతున్నారు. ఈ వింత ఘటన ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లా రుషికేశ్‌లో చోటుచేసుకుంది..
రావిచెట్టుకు మామిడికాయలు కాయడంతో అందరూ నివ్వెరపోతున్నారు. ఈ వింత ఘటన ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లా రుషికేశ్‌లో చోటుచేసుకుంది. రావి చెట్టుకు మామిడికాయలు కాసిన ఘటన వైరల్ కావడంతో ఈ వింతను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. హిమాలయాల దిగువభాగంలో ఉన్న రుషికేశ్‌లో పలు పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు ప్రతిరోజు అక్కడికి వందల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. అలా రుషికేశ్‌కు వెళ్లిన కొంతమంది భక్తులకు అక్కడున్న ఓ రావి చెట్టుకు మామిడిపండ్లు వేలాడుతూ కనిపించాయి. దీంతో ఆశ్చర్యానికి గురైన ఆ భక్తులు.. ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఇది చాలా వింతగానూ, ఆశ్చర్యంగానూ ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఇదేలా సాధ్యమంటూ జట్టు పీక్కుంటున్నారు.
అసలు విషయం ఇది
ఇది చాలామంది నెటిజన్లు నిజమని ఓ రేంజ్‌లో వైరల్ చేస్తున్నారు. అయితే టీవీ9 దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ నకిలీదని తేలింది.తుఫాను, గాలి దుమ్ము కారణంగా మామిడి చెట్టు ఒక కొమ్మ విరిగి రావి చెట్టులో చిక్కుకుంది. దీంతో రావి చెట్టుకు మామిటి కాయల కాశాయని జనాలు భ్రమపడ్డారు.
కాగా దీని గురించి పూర్తి వివరాలు తెలియకుండానే కొందరు విభిన్న ప్రచారాలకు తెరలేపుతున్నారు. రావి చెట్టుకు మామిడి కాయలు కాయడం మంచి సంకేతం కాదని చెబుతున్నారు. ఈ దశాబ్దం మొత్తం వినాశనాలే అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు ప్రచారం చేస్తున్నారు.
Mangoes for a Peepal Tree… Not a happy news. As per #Kalagnanam told by #veerabrahmaswamy many disasters are Going to happen this decade. 2024 is very crucial. Hindus, atleast be unite or else he told that from Kashmir to Vijayawada, Muzlims defeat Hindus in full. @RituRathaur pic.twitter.com/rDIEzqoCeG
— ProwdHindu (@HinduProwd) June 5, 2021
Also Read: ఆకలితో ఉన్న పాము… ఓ భారీ సైజ్ గుడ్డును ఎలా మింగేసిందో మీరే చూడండి