Karimnagar District: కరీంనగర్ జిల్లాలో అరుదైన దృశ్యం… లోయర మానేరు జలాశయంలో టోర్నడో

కరీంనగర్ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం జనాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఇలాంటి టోర్నడోలు కనిపిస్తుంటాయి.

Karimnagar District: కరీంనగర్ జిల్లాలో అరుదైన దృశ్యం... లోయర మానేరు జలాశయంలో టోర్నడో
Tornado
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 17, 2021 | 7:57 PM

కరీంనగర్ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం జనాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఇలాంటి టోర్నడోలు కనిపిస్తుంటాయి. జిల్లాలో గతంలో ఎప్పుడూ ఇలాంటి అరుదైన దృశ్యం చూడకపోవడంతో..  స్థానిక ప్రజలు ఈ వాటర్ స్పాట్ చూసి ఆశ్చర్యానికి, ఒకింత భయానికి గురయ్యారు.  కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని వచ్చునూర్‌ గ్రామ శివారులోని లోయర్ మానేరు డ్యాం బ్యాక్ వాటర్ లో నీరు సుడిగాలిలో చిక్కుకొని తిరుగుతూ ఆకాశంలోకి ఎగసిపోయింది. శనివారం సాయత్రం ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.

సాధారణంగా ఇలాంటి టోర్నడోలు విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి ఏకంగా గ్రామాలను సైతం నాశనం చేసిన ఘటనలూ ఉన్నాయి. ఇళ్ల మీదుగా టోర్నడో ప్రయాణిస్తే.. కట్టడాలన్నీ నామరూపాలు లేకుండా నాశనం అయిపోతాయి. కానీ, కరీంనగర్‌ జిల్లాలో ఏర్పడ్డ ఈ టోర్నడో కేవలం నీటిని తీసుకుపోయింది. ఈ ఆశ్చర్యకర ఘటనను చూసిన స్థానికులు కాస్త ఆందోళన కూడా పడ్డారు. కొందరు మాత్రం కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ చూస్తుండిపోయారు. అక్కడే పొలం పనులు చేసుకుంటున్న వ్యక్తులు దీన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 30 నిమిపాలపాటు జలాశయంలోని నీరు ఆకాశంలోకి వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. కాగా 2016 జూలై 31న ఇదే జలాశయం నడి మధ్యలో వాటర్ స్పాట్ ఏర్పడిందని పలువురు చెబుతున్నారు.

Also Read: ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో పవన్‌ను పలకరించేందుకు మంచు విష్ణు యత్నం.. కానీ

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..