Manchu Vishnu-Pawan Kalyan: ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో పవన్‌ను పలకరించేందుకు మంచు విష్ణు యత్నం.. కానీ

హైదరాబాద్‌లో దత్తన్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమం మొదలైంది. జలవిహార్‌లో అలయ్‌ బలయ్‌ సాంస్కృతిక కార్యక్రమాలను గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు.

Manchu Vishnu-Pawan Kalyan: 'అలయ్‌ బలయ్‌' కార్యక్రమంలో పవన్‌ను పలకరించేందుకు మంచు విష్ణు యత్నం.. కానీ
Pawan Vishnu
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 17, 2021 | 5:25 PM

హైదరాబాద్‌లో దత్తన్న ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం మొదలైంది. జలవిహార్‌లో అలయ్‌ బలయ్‌ సాంస్కృతిక కార్యక్రమాలను గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు. గిరిజన మహిళల నృత్యాలు, ఒగ్గు డోలు విన్యాసాలు, పెద్దపులుల వేసాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ కార్యక్రమంలో  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు పాల్గొన్నారు. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. అయితే ఇక్కడ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పవన్‌తో మాట్లాడేందుకు మంచు విష్ణు యత్నించారు. అయితే పవన్ అక్కడ నుంచి పక్కకు వెళ్లిపోయారు. అలయ్‌ బలయ్ అంటేనే ఒక జోష్. ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం. పలకరించుకోవడం. పాతవన్నీ మరిచిపోవడం. కాసేపు టెన్షన్లన్నీ పక్కన పెట్టడం. లైట్‌ తీసుకో భయ్యా అనే కాన్సెప్ట్. కానీ అలయ్‌ బలయ్‌ కాన్సెప్ట్‌కు పూర్తి వ్యతిరేకంగా కనిపించింది ఈ సీన్. ఇక్కడ కూడా ‘మా’ మంటలు కొనసాగాయి. జనసేన అధినేత పవన్, ‘మా’ న్యూ ప్రెసిడెంట్ విష్ణు స్టేజ్‌పై ఒకరికొకరు ఎదురుపడ్డారు. స్టేజ్‌పై మంచు విష్ణు ఉన్నారు. అప్పుడే పవన్ వచ్చారు. ఇద్దరూ ఎదురుపడ్డారు. కానీ మాటల్లేవ్. మాట్లాడుకోవడాల్లేవ్. ఒకరిమొహం మరొకరు చూసుకోలేదు. అదే స్టేజ్‌పై పవన్‌ ఓ మెమొంటో తీసుకున్నారు. నెక్స్ట్‌ విష్ణు వెళ్లాలి. మళ్లీ ఇద్దరూ ఫేస్‌ టు ఫేస్ ఎదురయ్యారు. సేమ్ సీన్. ఎడమొహం..పెడమొహం!.  విష్ణు పక్కకు జరిగారు. పవన్‌ వెళ్లిపోయారు. స్టేజ్‌పై పవన్‌- విష్ణు. పక్కపక్కనే సీట్లు. ఇబ్బందికరంగానే కూర్చున్నారు. ఇద్దరూ బంగ్ తాగారు. బట్‌ పలకరింపులు మాత్రం లేవు. ఒకరికొకరు తెలియదు అన్నట్లుగానే ప్రవర్తించారు. ఎవరో స్ట్రేంజర్ పక్కన కూర్చున్నట్లుగానే ఫీల్‌ అయ్యారు.

‘మా’  ఎన్నికల సందర్భంగా ఇటీవల అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. చిరు క్యాంప్ మద్దతిచ్చిన ప్రకాశ్ రాజ్ ఓటమి పాలయ్యారు. అంతేకాదు రెండు ప్యానల్స్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్దం కూడా జరిగింది. సైలెంట్‌గా ఉన్న మెగా ఫ్యామిలీపై కూడా కొందరు నోరు పారేసుకున్నారు. అయితే ఎన్నికల అనంతరం మంచు విష్ణు సోదరుడు మనోజ్ ‘భీమ్లా నాయక్’ సెట్స్‌కి వెళ్లి మరీ పవన్‌తో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరూ వివిధ విషయాలపై చర్చించారు. కానీ తాజాగా మంచు విష్ణుని కనీసం పలకరించేందుకు కూడా పవన్ ఇంట్రస్ట్ చూపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అయితే అలయ్‌ బలయ్‌ వేదిక నుంచి  మంచు విష్ణు ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘ఈ వీడియో చివరిలో ఉన్న పర్సన్ ఎవరో గుర్తించండి’ అని క్యాప్షన్ ఇచ్చారు. అందులో పవన్ కల్యాణ్ ఉన్నారు.

Also Read:  మా ఎన్నికల్లో మరో ట్వీస్ట్.. రంగంలోకి పోలీసులు..  సీసీ ఫుటేజ్‏ సీజ్ …