MAA Elections 2021: మా ఎన్నికల్లో మరో ట్వీస్ట్.. రంగంలోకి పోలీసులు.. సీసీ ఫుటేజ్ సీజ్ …
మా ఎన్నికలు ముగిసిన.. వివాదం మాత్రం తగ్గడం లేదు. ఫలితాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రకాష్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్
మా ఎన్నికలు ముగిసిన.. వివాదం మాత్రం తగ్గడం లేదు. ఫలితాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రకాష్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ మధ్య తీవ్ర వాగ్వాదం నడిచిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు చేశారు ప్రకాష్ రాజ్. ఎన్నికలు ముగిసి రోజులు గడుస్తున్న సినీ పరిశ్రమలో మాత్రం హీట్ తగ్గడం లేదు.. తాజాగా మాలో మరో ట్విస్ట్.! ఎన్నికలు ముగిసినా రచ్చ ఆగడం లేదు.! ఓవైపు డైలాగ్ వార్ జరుగుతూనే ఉంది. మరో వైపు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మా ఎలక్షన్ జరిగిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లోని సర్వర్‌రూమ్‌కు లాక్ చేశారు. ఎందుకు? ఏం జరిగింది? ఏం జరగబోతోంది?
ఇప్పుడు ఇష్యూ అంతా సీసీ ఫుటేజ్ చుట్టూ తిరుగుతోంది. ఇంతకీ అందులో ఏముంది? ఫుటేజ్ కావాలని ప్రకాష్ రాజ్ ఎందుకుకోరుతున్నారు. కుదరదని ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ ఎందుకు చెబుతున్నారు? ఇస్తే ఏం జరుగుతుంది? ఇవ్వకపోతే ఏ అంశాలు మరుగున పడుతాయి? ఇష్యూలోకి పోలీసుల ఎంట్రీ దేనికి? మరి నెక్ట్స్ ఏంటి? ఇప్పుడే ఇవే ప్రశ్నలు టాక్‌ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారాయి..
ఈనెల 10న జరిగాయి మా ఎలక్షన్స్. ఎన్నికలకు ముందు ఎంత రచ్చ జరిగిందో చూశాం. అయితే ఎన్నికల రోజు ఏకంగా రౌడీయిజం చేశారన్నది ప్రకాష్‌రాజ్ టీమ్ ఆరోపణ. మోహన్‌బాబు, నరేష్ భౌతిక దాడులకు దిగారాని, బండబూతులు తిట్టారని చెబుతున్నారు. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టిమరీ ఇదేవిషయం చెప్పారు. కౌంటింగ్ జరిగిన తీరుపైనా డౌట్స్ రైజ్ చేశారు. రాత్రి గెలిచాం..ఉదయానికి ఓడిపోయాం అంటూ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు. సరే ఇదంతా ఒక ఎపిసోడ్.
అయితే ఈ ఆరోపణలకు సాక్ష్యాలు కూడా ఉన్నాయంటోంది ప్రకాష్‌రాజ్ టీమ్. సీసీఫుటేజ్ ఇస్తే అన్ని విషయాలు బయటపడుతాయన్నది వారి వాదన. మరి ఇచ్చేందుకు ఎలక్షన్ ఆఫీసర్‌కు ఉన్న అభ్యంతరాలేంటి అన్నది తేలాల్సి ఉంది..మొత్తానికి మా సినిమా ఇంకా ముగియలేదు. పిక్చర్ అబీ బాకీ హై..!
గతంలో తమపై మోహన్ బాబు, నరేష్ దాడి చేశారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో ఉన్నాయన్నాయని ఎన్నికల అధికారికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తమకు సీసీ ఫుటేజ్ అందజేయాలని ఎన్నికల అధికారిని ప్రకాష్ రాజ్ కోరగా.. అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని తేల్చీ చెప్పారు ఎలక్షన్ ఆఫీసర్.
Also Read: K. Raghavendra Rao: ఈ అమ్మాయి ఎలా చేస్తుందో అని అనుకున్నాను.. : కె. రాఘవేంద్రరావు
Mega Powerstar Ram Charan: ప్రశాంత్ నీల్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. ఏమన్నాడంటేయ