AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega Powerstar Ram Charan: ప్రశాంత్ నీల్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. ఏమన్నాడంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాను కంప్లీట్ చేసి శంకర్ సినిమాకోసం సిద్ధం అవుతున్నారు.

Mega Powerstar Ram Charan: ప్రశాంత్ నీల్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. ఏమన్నాడంటే..
Ram Charan
Rajeev Rayala
| Edited By: |

Updated on: Oct 17, 2021 | 10:26 AM

Share

Mega Powerstar Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాను కంప్లీట్ చేసి శంకర్ సినిమాకోసం సిద్ధం అవుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇందులో చెర్రీతోపాటు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇందులో అలీయా భట్.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటుంది. అలాగే చరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత తమిళ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు… ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాతర్వాత చరణ్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవల సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ చిరంజీవి కలిసిన ఫోటోను షేర్ చేశారు. దాంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ వార్తలపై చరణ్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా నాట్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన చరణ్ మాట్లాడుతూ.. ప్రశాంత్ నీల్ సినిమా వెంటనే చేయడం లేదు. బహుశా భవిష్యత్తులో ప్లాన్ చేసుకోవచ్చు అని క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manchu Vishnu: కొత్త టీమ్ వచ్చేసింది.. కానీ వారి పరిస్థితి ఏంటి.. ‘మా’ లో వీడని సస్పెన్స్

Natyam Pre Release Event LIVE: రామ్ చరణ్ ముఖ్య అతిథిగా ‘నాట్యం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్.. డ్యాన్స్‌పై ఇష్టంతోనే గెస్ట్‌గా హాజరవుతున్న చెర్రీ..

Eesha Rebba : తెలుగమ్మాయి పరువాల అందం.. చూడతరమా.. ‘ఈషా రెబ్బ’ న్యూ ఫొటోస్…

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్