K. Raghavendra Rao: ఈ అమ్మాయి ఎలా చేస్తుందో అని అనుకున్నాను.. : కె. రాఘవేంద్రరావు
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘పెళ్లి సందD’. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఆయన శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు.
K. Raghavendra Rao:
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘పెళ్లి సందD’. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఆయన శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా సందర్భంగా సినిమాను అక్టోబర్ 15న విడుదల చేశారు. శనివారం ఈ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా… దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ..
‘పెళ్లి సందD’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. పాతికేళ్ల ముందు తీసిన పెళ్లి సందడి సినిమాను ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లు మార్చి తీసిన డైరెక్టర్ గౌరి రోణంను అభినందించారు రాఘవేంద్రరావు. “ఈ సినిమాను ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులకు నా 110 సినిమాల నమస్కారాలు. గౌరి నా దగ్గర పదేళ్లుగా పనిచేస్తుంది. తను సినిమాను తెరెక్కించిన విధానం నాకెంతో నచ్చింది అన్నారు. అలాగే హీరో రోషన్.. హీరోయిన్ శ్రీలీలకు థాంక్స్. నేను ఎంతో స్టార్ హీరోలను, హీరోయిన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాను. ఇప్పుడు అదే నమ్మకంతో రోషన్‌ను కూడా నాకు అప్పగించారు. తను అంతే చక్కగా నటించాడు. శ్రీలీల అందంగా నటించింది. తను డాక్టర్ చదువుతుంది. హాకీలో స్టేట్ ప్లేయర్, స్విమ్మింగ్‌లో నెంబర్ వన్. ఆరు భాషలను మాట్లాడే అమ్మాయి తను. ఎలా నటిస్తుందా? అనిపించేది. అయితే రిహార్సల్‌లోనే నటిగా తనేంటో ప్రూవ్ చేసుకుంది అని శ్రీలీలను ఆకాశానికేతేశారు. కీరవాణి, చంద్రబోస్ కాంబినేషన్లో చేసిన పాటలు ప్రేక్షకులకు అద్భుతంగా కనెక్ట్ అయ్యాయి. పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూసి ప్రేక్షకుల ఈలలు వేస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలను చూడాలనుకునే ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్స్ చేసి చెబుతున్నారు అన్నారు. ఈ సందర్భంలో థియేటర్స్‌కు వంద శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ కు, ఆయన ప్రభుత్వానికి థాంక్స్’’ అన్నారు రాఘవేంద్రరావు.
మరిన్ని ఇక్కడ చదవండి :