ఎడారిలో 200 అస్థిపంజరాలు.. దారుణంగా చంపేశారు..! ఇందులో సగం పురుషులు సగం మహిళలు..
Atacama Desert: దక్షిణ అమెరికాలోని చిలీకి చెందిన అటకామా ఎడారి హింసా కాండకు కేంద్ర బిందువుగా మారింది. వివిధ పరిశోధనల కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.
Atacama Desert: దక్షిణ అమెరికాలోని చిలీకి చెందిన అటకామా ఎడారి హింసా కాండకు కేంద్ర బిందువుగా మారింది. వివిధ పరిశోధనల కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. 3000 సంవత్సరాల క్రితం నాటి రహస్యం ఒకటి బయటపడింది. ఇది వింటే అందరూ ఆశ్చర్యపోతారు. ఇక్కడ నివసించే ప్రతి 10 మందిలో ఒకరిని కొట్టి చంపేశారు. తాజాగా 200 అస్థిపంజరాలను కనుగొన్నారు. చిలీలోని తారాపాకా విశ్వవిద్యాలయం నిపుణులు ఈ పరిశోధన నిర్వహించారు.
194 అస్థిపంజరాలలో 40 అస్థిపంజరాలను పరీక్షించారు. దీంతో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరు అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారని తేలింది. 26 శాతం మంది పురుషులు, 15 శాతం మంది మహిళలు హింసించబడ్డారని కనుగొన్నారు. పదునైన కర్రతో కొన్ని దాడులు చేసినట్లు గుర్తించారు. మెదడులోని కొంత భాగం బయటకు వచ్చేలా చంపారని చెబుతున్నారు. ముఖ ఎముకలు విరిగిపోవడం వల్ల చాలా మంది మరణించారు. ఈ పరిశోధనలో శరీరంలోని ప్రతి భాగంపై బలంగా కొట్టడం వల్ల చనిపోయారని నిర్ధారించారు.
ఇక్కడ హింస ఎందుకు జరిగింది.. అటకామా ఎడారిలో ఈ హింస ఎందుకు జరిగిందో స్పష్టంగా ఎవరికి తెలియదు. కానీ దీని వెనుక కారణం ఏంటంటే ఎడారిలో పరిమిత వనరులు, తక్కువ నివాస స్థలం ఉండటం అని కొంతమంది నమ్ముతున్నారు. అయితే ఎడారి వేడి, పొడి కారణంగా అస్థిపంజరాలు భద్రంగా ఉన్నాయని అధ్యయన నిపుణులు తెలిపారు.
ఎడారి మార్స్ లాగా కనిపిస్తుంది శాస్త్రవేత్తలు ఈ హింస స్థానిక సమూహాల మధ్య జరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం అటకామా ఎడారి గురించి మాట్లాడితే అది కొంతవరకు అంగారక గ్రహంలా కనిపిస్తుంది. ఎర్ర రంగు నేల, లావా, లోతైన లోయలతో తయారు చేసిన నల్లని అగ్నిపర్వతాలు, ఇసుక ఉంటాయి. చిలీలోని యుంగే పట్టణం ఈ ఎడారికి సమీపంలో ఉంటుంది. ఈ ప్రదేశం ప్రపంచంలోని అత్యంత పొడి ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. దశాబ్దాలుగా ఇక్కడ వర్షపు చుక్క కూడా పడలేదు. దీని కారణంగా ఇక్కడ నేల చాలా పొడిగా ఉంటుంది.