Pub Culture: అక్కడ రూల్స్.. గీల్స్ జాన్తానై.. పబ్బుల్లో నిబంధనలు గాలికి.. చిన్నారులను కూడా అనుమతిస్తున్న వైనం..

అదో మత్తులోకం... అదంతా గమ్మత్తు మైకం..! కొందరికి మార్నింగ్‌తో డే స్టార్స్ అయితే..! అక్కడ మాత్రం చీకటి పడ్డాకే అసలు కథ మొదలవుతుంది. మసక మసక చీకట్లో.. చెవులు చిల్లులు పడే డీజేలతో..

Pub Culture: అక్కడ రూల్స్.. గీల్స్ జాన్తానై.. పబ్బుల్లో నిబంధనలు గాలికి.. చిన్నారులను కూడా అనుమతిస్తున్న వైనం..
Kid In Pub
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 01, 2021 | 3:37 PM

అదో మత్తులోకం… అదంతా గమ్మత్తు మైకం..! కొందరికి మార్నింగ్‌తో డే స్టార్స్ అయితే..! అక్కడ మాత్రం చీకటి పడ్డాకే అసలు కథ మొదలవుతుంది. మసక మసక చీకట్లో.. చెవులు చిల్లులు పడే డీజేలతో.. కలర్‌ఫుల్‌ కాక్‌టెయిల్‌తో.. అబ్బో ఆ హంగామా. ఆ హడావుడే వేరు..!  ఆ లైట్స్‌ ఆనాఫ్‌ అవుతూ కొంచెం కన్ఫ్యూజ్‌ చేస్తుంటాయి.. ఇదో కొత్త లోకం అని మన మైండ్‌ని అలెర్ట్‌ చేస్తుంటాయి.  కలర్‌ఫుల్‌ కాక్‌టెయిల్స్‌ వద్దన్నా టెంప్ట్‌ చేస్తుంటాయి. ఓ రేంజ్‌ బీట్‌తో సాగే డీజేలు వద్దనుకున్నా బాడీని షేక్‌ చేస్తుంటాయి. కొందరికి పబ్‌ ఓ రిలాక్సేషన్ ! మరికొందరికి పబ్‌ ఓ అడిక్షన్‌‌గా మారుతుంటాయి.

పబ్‌ల్లో లైటింగ్, మ్యూజిక్ దగ్గర నుంచి ఆల్కహాల్‌ కోసం వాడే గ్లాసుల వరకూ ప్రతీదీ అట్రాక్ట్‌ చేస్తుంది. అందుకే యువత దీన్ని మరో ప్రపంచం అనేది..  ఆరు రోజులు ఆలసిపోయి… ఏడో రోజు పబ్‌లో వాళిపోతారు. అది పరిమితులు లేని ప్రపంచం… పబ్బుల్లో యువత డీజేల మ్యూజిక్ కోసం చెవి కోసుకుంటారు. మ్యూజిక్‌కి అనుగుణంగా డాన్స్ చేస్తూ తెల్లవార్లు ఎంజాయ్ చేస్తునే ఉంటారు. పబ్బులు కొందరికి రిలాక్సేషన్ హబ్‌లుగా మారితే… యూత్‌కి ఎంజాయ్‌మెంట్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. ఇదంతా కాయిన్‌కి ఓవైపు ! మరోవైపు చూస్తే…. ఆ కథే వేరు!

సిటీలోని పబ్బుల్లో వీక్‌ డేస్‌లో పెద్దగా జోష్‌ లేకపోయినా… వీకెండ్‌ మొదలైతే చాలు అసలు హంగామా, హడావుడి మొదలవుతుంది. ఆకాశమే హద్దుగా యువత గంతులేస్తుంటే… వారి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు ఖాళీ చేసేందుకు పబ్‌ ఓనర్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. మీరు సింగిలా ? ఏం ఫర్వాలేదు… మీకు గర్ల్‌ఫ్రెండ్‌ని మేం అరేంజ్‌ చేస్తాం… గంటకు రెండు, మూడు వేలు పే చేస్తే చాలు ! ఆమెతో డ్యాన్స్‌ చేస్తారా ? ఇంకేం చేస్తారా అది మీ ఇష్టం ! అవును సిటీలోని కొన్ని పబ్‌ల్లో అచ్చంగా ఇదే దందా నడుస్తోంది. దీన్నే రెంట్‌ ఏ గర్ల్‌ఫ్రెండ్‌గా పిలుస్తున్నారు.

అయితే హైదరాబాద్‌లోని పెద్ద పబ్‌ ఒకటి ఇప్పుడు మరో అడుగు ముందుకు వెసినట్లుంది. ఇప్పటి వరకు ఆరు దాటగానే యూత్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అక్కడికి మారిపోతుంది.  అయితే ఇప్పుడు ఆ పబ్ కల్చర్‌ కాస్తా కుటుంబాల్లోకి చొచ్చుకు పోతుంది. తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ పబ్‌కు ఐదు సంవత్సరాలు దాటని ఓ చిన్నారిని తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. జిగేళ్ మనే లైట్ల మధ్యలో.. ఉల్లాసాన్ని నింపే సంగీతంలో.. అందరూ ఊగిపోయారు. ఒళ్లు మరిచి చిందులేసారు. చిన్నారితో డ్యాన్స్.. డ్యాన్స్ అంటూ స్టెప్పులేయించారు. మంచివిద్యాబుద్దులు నేర్పించాల్సిన తల్లి దండ్రులు ఇలాంటి చోటికి ఎలా తీసుకెళ్లారు. వారు ఓకే మరి.. పబ్ నిర్వాహకులు ఎలా అనుమతి ఇచ్చారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.  నిబంధనలను గాలికి వదిలేశారా అంటూ ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పోలీసులు ఏం చేస్తున్నారు.. నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటున్నారా..? అని అడుగుతున్నారు. 10 ఏళ్ల బాలికను పబ్ లోకి అనుమతించిన గచ్చిబౌలిలోని “లాల్ స్ట్రీట్ పబ్” చర్యలు ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నారు. ఈ ఇలాంటి వీడియోను ఓ నెటిజన్ సైబరాబాద్‌ సీపీకి ఫిర్యాదు చేశాడు. అంతే కాదు లాల్ స్ట్రీట్ పబ్ ఫై చర్యలు తెసుకోవాలని సైబరాబాద్‌కు సీపీకి ట్వీట్ చేశారు.

ఇక కొవిడ్‌ నిబంధనలు సడలించిన ప్రభుత్వం.. పబ్‌లు ఓపెన్‌ చేయడానికి అనుమతి ఇచ్చింది. అదే సమయంలో కచ్చితంగా కొన్ని నిబంధనలను పాటించాలంటూ పబ్‌ నిర్వాహకులను ఆదేశించింది. పబ్‌ లోపలికి రావాలంటే మాస్క్‌ కంపల్సరీ చేశారు. పబ్‌లలో “నో మాస్క్‌ నో ఎంట్రీ” రూల్‌ కచ్చితంగా పాటించాలి. అలాగే పబ్‌ లోపల సోషల్‌ డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేయాలి. పబ్‌లలో వెయిటర్స్‌, ఇతర సిబ్బంది తప్పక మాస్క్‌లు ధరించాలి. దీంతోపాటుగా డ్యాన్స్‌ ఫ్లోర్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనలను పాటిస్తూ పబ్‌లకు తెరుచుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.  అయితే ఈ పబ్‌ ఊగుతున్నవారు ఎలాంటి కోవిడ్ నిబంధనలు పాటించినట్లుగా ఎక్కడా కనిపించడం లేదు.

చట్టాలు, పోలీసులను లెక్కచేయకుండా యువతను మత్తులో దించుతున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూర్ సిటీల తరహాలో మన సిటీలో కూడా పెరిగిపోతున్న పబ్ కల్చర్ యువత నుంచి కాస్తా ఇప్పుడు ఇలా చిన్నారులను తీసుకురావడం కొంత ఆందోళనకు గురి చేస్తోంది. కనీస కోవిడ్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం లేదు. ఇలాంటి పబ్ కల్చర్ పై అధికారుల నిఘా అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ‘రూల్స్.. గీల్స్ జాన్తానై’ అంటూ పబ్ నిర్వాహకులు ఇష్టమొచ్చినట్టుగా వాటిని నడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి: Cheating of love: మైనర్‌ను లోబరుచుకుని పెళ్లి చేసుకున్న యువతి.. పోక్సో చట్టం కింద అరెస్టు చేసిన పోలీసులు..!

Telangana Governor: టీచర్‌గా మారిన తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ప్రతీ క్లాస్ రూం తిరిగి ఏం పాఠాలు చెప్పారంటే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే