AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్‌ మెట్రో రైల్ వాటా.. విక్రయానికి ఎల్ అండ్ టీ మరిన్ని ఆస్తులు..?

అమ్మకానికి హైదరాబాద్ మెట్రో.. అవును ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేయవచ్చు.. నష్టాల నుంచి గట్టెక్కేందుకు హైదరాబాద్ మెట్రోలో వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్‌ మెట్రో రైల్ వాటా.. విక్రయానికి ఎల్ అండ్ టీ మరిన్ని ఆస్తులు..?
Balaraju Goud
|

Updated on: Sep 01, 2021 | 2:00 PM

Share

Hyderabad Metro for sale: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో.. అవును ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేయవచ్చు.. నష్టాల నుంచి గట్టెక్కేందుకు హైదరాబాద్ మెట్రోలో వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీ లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ) ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ మెట్రోలో వాటాలను అమ్మేందుకు కంపెనీ నిర్ణయించింది.

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ తమ వాటాను విక్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. కీలకేతర ఆస్తులను అమ్మేస్తున్నట్టు ఎల్ అండ్ టీ ప్రకటించింది. సంస్థ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (డెవల్‌పమెంట్‌ ప్రాజెక్ట్స్‌) డీకే సేన్‌ మంగళవారం ఈ మేరకు సంకేతాలిచ్చారు. ఉత్తరాఖండ్‌లోని నాబా కోర్ ఆస్తులు 1400 మెగావాట్ (MW) నాభా థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను విక్రయించాలని యోచిస్తోంది. ఎల్‌అండ్‌టీకి చెందిన 99 మెగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టును రెన్యూ పవర్‌ కంపెనీకి విక్రయించిన విషయాన్ని వెల్లడిస్తూ విడుదల చేసిన ప్రకటనలో సేన్‌ ఈ విషయం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటైన హైదరాబాద్‌ మెట్రోలో ఎల్‌అండ్‌టీకి 90 శాతం వాటా ఉండగా, 10 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ మేరకు విడుదల చేసిన జాబితాలో హైదరాబాద్ మెట్రోతో పాటు ఇతర ఆస్తుల వివరాలు కూడా ఉన్నాయి. ఒకవైపు మెట్రోను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూనే మరోవైపు రుణాల కోసం సంస్థ ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.

కరోనాతో పాటు అప్పుల కారణంగా ఎల్ అండ్ టీపై భారం పెరిగింది. మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,571 కోట్లు కాగా.. వివిధ కారణాలతో రూ.18,971 కోట్లకు అంచనాలు చేరాయి. అయితే అప్పుల ద్వారా సేకరించిన మొత్తం రూ.13,500 కోట్లు ఉన్నాయి. 2019 – 20లో రూ.383 కోట్ల నష్టాలను చవిచూసింది. 2020 21లో ఏకంగా రూ.1,766 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ఈ మేరకు సంస్థ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీకే సేన్‌ సంకేతాలిచ్చారు.

అయితే, ఇందులో పూర్తి వాటాను విక్రయిస్తారా? లేక కొంత వాటానా? అన్నది మాత్రం సేన్‌ వెల్లడించలేదు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుతోపాటు పంజాబ్‌లోని నభా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని కూడా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు తమ సంస్థ ఆధ్వర్యంలోని ఇతర ఆస్తులను కూడా విక్రయించాలని చూస్తున్నట్లు తెలిపారు. బ్బందులు మరీ తీవ్రంగా లేకపోయినా, కీలకేతర వ్యాపారాల నుంచి తప్పుకొని.. ఆ నిధులను ఇతర కీలక వ్యాపారాలకు వినియోగించడం మంచిదని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

క్రమంగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం, ప్రాజెక్టు వ్యయం పెరిగిపోవడంతో కంపెనీకి అసలు, వడ్డీ చెల్లింపులు భారంగా మారాయి. ఉద్యోగుల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో భవిష్యత్తులోనూ ప్రయాణికుల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ కష్టాల నుంచి బయటపడేందుకు తక్కువ వడ్డీతో రూ.5 వేల కోట్ల రుణసాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎల్‌అండ్‌టీ కోరింది. కానీ, దీనిపై ప్రభుత్వ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. మరోవైపు రూ.4 వేల కోట్ల పెట్టుబడుల కోసం నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎ్‌ఫ)తో జరుపుతున్న చర్చలు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. పెట్టుబడుల కోసం ఇతర కంపెనీలతో జరిపిన చర్చలు కూడా ఫలించలేదు.దీంతో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో తన వాటాను అమ్ముకోవడమే మేలని ఎల్‌అండ్‌టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also… Telangana Politics: యుద్ధం మొదలైపోతే ఇంకా కన్ఫ్యూజన్ లోనే టీ కాంగ్రెస్.. పాదయాత్రలపైనా లేని క్లారిటీ.!