CM KCR: ప్రత్యేక ఫ్లైట్‌లో ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్.. గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమి పూజ..
దేశరాజధానిలో ఆఫీసుని నిర్మించాలన్న ఆ పార్టీ కల సాకారం కాబోతోంది. గురువారం భూమిపూజ చేయనున్నారు సీఎం KCR. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు హస్తిన చేరుకున్నారు. ఎన్నాళ్లో..
గల్లీ టు ఢిల్లీ..! టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో విజయం! దేశరాజధానిలో ఆఫీసుని నిర్మించాలన్న ఆ పార్టీ కల సాకారం కాబోతోంది. గురువారం భూమిపూజ చేయనున్నారు సీఎం KCR. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు హస్తిన చేరుకున్నారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది. దేశరాజధాని హస్తినలో TRS భవన్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. గురువారం రోజు సుముహూర్తం. సరిగ్గా ఒంటిగంటా 48 నిమిషాలకు భూమిపూజ చేయనున్నారు CM కేసీఆర్. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో TRS కార్యాలయ నిర్మాణం కోసం 1300 గజాల స్థలాన్ని కేటాయించింది కేంద్రం.
CM KCR ప్రత్యేక ఫ్లైట్‌లో ఢిల్లీకి చేరుకున్నారు. 3వ తేదీన తిరిగి హైదరాబాద్ వస్తారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు మంత్రులు, MLAలు, MPలు ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఏర్పాట్లను పరిశీలించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో ఆఫీసు లేదు. అలాంటిది TRS పార్టీ ప్రత్యేకంగా ఆఫీసును నిర్మించుకోవడంపై నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
40 కోట్లతో అంచనా వ్యయంతో TRS భవన్‌ను నిర్మిస్తున్నారు. మీటింగ్ హాల్‌తోపాటు రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చే వారు స్టే చేసేందుకు అన్ని ఫెసిలిటీస్ ఉండేలా డిజైన్ చేశారు. TRS భవన్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను పోలి ఉంటుందని అంటున్నాయి పార్టీ శ్రేణులు. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే శంకుస్థాపన కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ వల్ల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది.
ఏడాదిలోపే నిర్మాణాన్ని పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా గ్రాండ్‌గా జరపాలని ప్లాన్ చేశారు. పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలను ఆహ్వనించే ఛాన్స్ ఉంది.
ఇవి కూడా చదవండి: Pub Culture: అక్కడ రూల్స్.. గీల్స్ జాన్తానై.. పబ్బుల్లో నిబంధనలు గాలికి.. చిన్నారులను కూడా అనుమతిస్తున్న వైనం..