Afghanistan Crisis: తాలిబన్లపై మరోసారి పంజా విసిరిన పంజ్‌షేర్‌ .. తాజాగా 350 మంది హతం..కీలక ప్రకటన చేసిన నార్తర్న్‌ అలయెన్స్‌..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Sep 01, 2021 | 4:51 PM

పంజ్‌షేర్‌ వ్యాలీలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికి తాలిబన్లు పట్టువీడడం లేదు. ఎలాగైనా పంజ్‌షేర్‌ వ్యాలీని స్వాధీనం చేసుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు.

Afghanistan Crisis:  తాలిబన్లపై మరోసారి పంజా విసిరిన పంజ్‌షేర్‌ .. తాజాగా 350 మంది హతం..కీలక ప్రకటన చేసిన నార్తర్న్‌ అలయెన్స్‌..
Northern Alliance Claimed T
Follow us

పంజ్‌షేర్‌ వ్యాలీలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికి తాలిబన్లు పట్టువీడడం లేదు. ఎలాగైనా పంజ్‌షేర్‌ వ్యాలీని స్వాధీనం చేసుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు. నార్తర్న్‌ అలయెన్స్‌తో చర్చలు విఫలం కావడంతో ముప్పేట దాడులకు పాల్పడుతున్నారు. అయితే తాలిబన్లకు కోలుకోలేని షాకిచ్చినట్టు నార్తర్న్‌ అలయెన్స్‌ బలగాలు ప్రకటించాయి. తాజాగా 350 మంది తాలిబన్లను హతం చేసినట్టు నార్తర్న్‌ అలయెన్స్‌ ప్రకటించింది.

అమెరికా, నాటో బలగాలు ఆఫ్ఘన్‌ విడిచి వెళ్లడంతో తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నారు. కాందహార్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆర్మీ ట్యాంకులు, వాహనాలతో భారీ ర్యాలీ తీశారు. ఖోస్త్‌లో అమెరికా , నాటో బలగాలకు శవయాత్ర నిర్వహించారు తాలిబన్లు. ఇప్పటికి తమకు సంపూర్ణ అధికారం దక్కిందని సంబరాలు చేసుకుంటున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లది ఆడిందే ఆట … పాడిందే పాట. 20 ఏళ్ల పాటు దేశంలో ఉన్న అమెరికా బలగాలు వెళ్లిపోవడంతో సంబరాల్లో మునిగితేలుతున్నారు తాలిబన్లు. అమెరికా వదిలిపెట్టిన ఆయుధాలు, దుస్తులు , హెల్మెట్లు, బూట్లు ధరించి దర్జాగా తిరుగుతున్నారు. తాలిబనన్ల బద్రి కమెండో ఫోర్స్‌ పూర్తిగా అమెరికా కమెండోల లాగే తయారయ్యారు. కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఈ కమెండోలు సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారు. అమెరికా బలగాలు వెళ్లిపోయిన తరువాత తాలిబన్‌ అగ్రనేతలు కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి బద్రి ఫోర్స్‌కు తగిన సూచనలు చేశారు.

ఇవి కూడా చదవండి: Cheating of love: మైనర్‌ను లోబరుచుకుని పెళ్లి చేసుకున్న యువతి.. పోక్సో చట్టం కింద అరెస్టు చేసిన పోలీసులు..!

Telangana Governor: టీచర్‌గా మారిన తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ప్రతీ క్లాస్ రూం తిరిగి ఏం పాఠాలు చెప్పారంటే..

Pub Culture: అక్కడ రూల్స్.. గీల్స్ జాన్తానై.. పబ్బుల్లో నిబంధనలు గాలికి.. చిన్నారులను కూడా అనుమతిస్తున్న వైనం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Click on your DTH Provider to Add TV9 Telugu