Tandur municipal chairperson: నిలదీస్తే చెప్పుతో కొడతా.. మరోసారి నోరు పారేసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్న

తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న మరోసారి నోరు పారేసుకున్నారు. ఆమె భర్త భూకబ్జాలపై నిలదీసిన

Tandur municipal chairperson: నిలదీస్తే చెప్పుతో కొడతా.. మరోసారి నోరు పారేసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్న
Tadikonda Swapna
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 01, 2021 | 1:58 PM

Tandur municipal chairperson – Tatikonda swapna: తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న మరోసారి నోరు పారేసుకున్నారు. ఆమె భర్త భూకబ్జాలపై నిలదీసిన ప్రజలను చెప్పుతో కొడతానంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. లోతుల్లోకి వెళితే, తాడికొండ స్వప్న. ఆ మధ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొని ఎట్టకేలకు ఏదోలా బయటపడ్డ ఆమె. ఇప్పుడు ఒక ఘనమైన స్టేట్‌మెంట్‌ ఇచ్చి మళ్లీ వివాదంలోకి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు మున్సిపాలిటీలో చేపట్టిన “గల్లీ గల్లీ కి పైలెట్ ” కార్యక్రమం జరిగింది.

“గల్లీ గల్లీ కి పైలెట్ ” కార్యక్రమం ముగింపు వేళ.. 13వ వార్డు పర్యటనకు వెళ్లారు నేతలు. కాలనీకి చెందిన కొందరు పేదలు తాము రూపాయి రూపాయి పోగుచేసి కొనుక్కున్న ఇళ్ల స్థలాలను కొందరు వ్యక్తులతో కలిసి పరిమల్ గుప్తా కబ్జా చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆటైమ్‌లో అక్కడే ఉన్నారు గుప్తా భార్య, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్వప్న. తన భర్త పేరుతో ఫిర్యాదు చేస్తారా.. అంటూ సహనం కోల్పోయిన ఆమె.. చెప్పుతో కొడతానని నోరుపారేసుకున్నారు. ఆమె అన్న ఈ మాటలను అక్కడే ఉన్న కాంగ్రెస్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

అంతటితో ఆగకుండా ఆయన చైర్పర్సన్ వ్యాఖ్యలకు నిరసనగా పేదలతో పాటు మోకాలిపై కూర్చుని నిరసన తెలిపారు. తక్షణమే పేదలకు మున్సిపల్ చైర్ పర్సన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. విషయం ఏంటంటే కామెంట్ చేసింది కాంగ్రెస్ నేత స్వప్న, నిరసన చెప్పిదీ కాంగ్రెస్‌ లీడర్లే.

Read also: Telangana Politics: యుద్ధం మొదలైపోతే ఇంకా కన్ఫ్యూజన్ లోనే టీ కాంగ్రెస్.. పాదయాత్రలపైనా లేని క్లారిటీ.!