AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh Farmer: 72 వేలు పెట్టుబడితో ఈ పంట వేసి మూడు నెలలకు 8లక్షలు లాభం ఆర్జిస్తున్న యూపీ రైతు

జై జవాన్ జై కిసాన్ మన నినాదం.. దేశానికి పెట్టని గోడలా రక్షణగా ఆర్మీ జవాన్లు నిలబడితే.. అందరికీ అన్నం పెట్టేది రైతు. అటువంటి అన్నదాత పిడికెడు అన్నం కోసం అల్లాడే స్టేజ్ లో ఉన్న సందర్భాలు ఎన్నో.. ఇక పంట చేతికి...

Uttar Pradesh Farmer: 72 వేలు పెట్టుబడితో ఈ పంట వేసి మూడు నెలలకు 8లక్షలు లాభం ఆర్జిస్తున్న యూపీ రైతు
Cucumber Cultivation
Surya Kala
| Edited By: Team Veegam|

Updated on: Mar 30, 2021 | 6:35 PM

Share

Uttar Pradesh Farmer: జై జవాన్ జై కిసాన్ మన నినాదం.. దేశానికి పెట్టని గోడలా రక్షణగా ఆర్మీ జవాన్లు నిలబడితే.. అందరికీ అన్నం పెట్టేది రైతు. అటువంటి అన్నదాత పిడికెడు అన్నం కోసం అల్లాడే స్టేజ్ లో ఉన్న సందర్భాలు ఎన్నో.. ఇక పంట చేతికి వచ్చేసమయానికి ప్రకృతి కూడా పగబట్టినట్లు అకాల వర్షాలు కురవడం లేదా.. అతి వృష్టి, అనావృష్టిలతో రైతుని కన్నీరు పాలు చేస్తుంది. ఇక చేతికి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే అటువంటి రైతుకి కష్టాలు.. నష్టాలూ రాకుండా మార్కెట్ కు అనుగుణంగా పంటలు పండించే విధంగా తగిన సూచనలు ఇస్తే.. లాభాలను సులభంగా పొందవచ్చు అంటున్నారు..తాజాగా వేసవి దాహార్తిని తీర్చే కీరదోస పంట సాగు చేయడం ద్వారా లక్షల్లో లాభాలను సొంతం చేసుకోవచ్చు. అవును కీర దోస పంటను సాగు చేయడం ద్వారా ఓ రైతు ఏకంగా రూ. 8లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్ కు చెందిన దుర్గాప్రసాద్ అనే రైతు వ్యవసాయాన్ని దండగ కాదు పండగ చేసుకోలనుకున్నాడు.. దీంతో మార్కెట్ పై అధ్యయనం చేశాడు.. కీరదోస సాగు చేస్తే.. ఈజీగా లాభాలను పొందవచ్చు అని తెలుసుకున్నాడు.. అయితే మన దేశంలో పాండే కీర దోసకు విత్తనాలు ఉంటాయి కనుక.. మరింత లోతుగా అధ్యయనం చేశాడు. నెదర్లాండ్స్ నుండి కీరదోస విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేశాడు. ఏందుకంటె అక్కడ పండే కీర దోసల్లో మాత్రం విత్తనాలు ఉండవు. పైగా దేశీయ కీరదోసతో పోలిస్తే.. దేశీ కీరదోసతో పోలిస్తే ఈ కీరదోస రెట్టింపు ధర పలుకుతుంది. కేవలం రెండున్నర నెలల్లో పంట చేతికి వస్తుంది.

దుర్గాప్రసాద్ ఈ పంట కోసం ముందుగా రూ. 72వేలను పెట్టుబడిగా పెట్టాడు. ఇక ఈ పంటపై ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇతర కాలాలతో పోలిస్తే వేసవి కాలం కీరదోస పంట వేయడానికి అనువైన కాలం. వర్షాకాలంలో కూడా ఈ పంటను సాగు చేయవచ్చు. ఈ పంటను సాగు చేయాలనుకునే రైతులు ఉద్యాన శాఖ ప్రొత్సాహం ఇస్తుంది.

Also Read: ఈ పాముకి సిగ్గు ఎక్కువ.. గుడ్లు పెట్టడానికి గూడు కట్టే ఏకైక పాము.. తేడా వస్తే అంతు చూస్తుంది అంతే…!

ఇంట్లోకి వచ్చిన పామును చంపేయకుండా పాలు పోసి పెంచుతున్నారు.. అనంతపురం జంట వింత నిర్ణయం..

జబర్ధస్త్ షూటింగ్ సెట్‏లో టీమ్‏ లీడర్ల మధ్య గొడవ.. ఆత్మహత్య ప్రయత్నం చేసిన వర్ష..