Snake In Home: ఇంట్లోకి వచ్చిన పామును చంపేయకుండా పాలు పోసి పెంచుతున్నారు.. అనంతపురం జంట వింత నిర్ణయం..

Couple Adopt Snake In Andhra Pradesh: మీ ఇంట్లోకి అనుకోని అతిథిగా ఓ విష సర్పం వస్తే ఏం చేస్తారు.? ఏముంది.. అవకాశం ఉంటే పాములు పట్టే వ్యక్తిని పిలిపిస్తాం లేదంటే చంపడానికి ప్రయత్నిస్తామని చెబుతారు కదూ. మీరే కాదు..

Snake In Home: ఇంట్లోకి వచ్చిన పామును చంపేయకుండా పాలు పోసి పెంచుతున్నారు.. అనంతపురం జంట వింత నిర్ణయం..
Snake Adopt
Follow us

|

Updated on: Mar 29, 2021 | 5:02 PM

Couple Adopt Snake In Andhra Pradesh: మీ ఇంట్లోకి అనుకోని అతిథిగా ఓ విష సర్పం వస్తే ఏం చేస్తారు.? ఏముంది.. అవకాశం ఉంటే పాములు పట్టే వ్యక్తిని పిలిపిస్తాం లేదంటే చంపడానికి ప్రయత్నిస్తామని చెబుతారు కదూ. మీరే కాదు మనలో చాలా మంది తీసుకునే నిర్ణయం ఇదే. కానీ అనంతపురానికి చెందిన ఓ జంట మాత్రం విభిన్న నిర్ణయం తీసుకుంది. ఇంటి పెరట్లోకి వచ్చిన ఓ పామును ఎంచక్కా పెంచి పోషిస్తోంది. దాన్ని ఓ పెట్‌ స్నేక్‌లాగా మార్చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జర్మన్‌ దేశానికి సెబాస్టియన్‌ దంపతులు సత్యసాయి భక్తులు. వీరిద్దరి పుట్టపర్తిలోని ఉపాసన విల్లాస్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఓ పది అడుగుల విష సర్పం సోమవారం సెబాస్టియన్‌ జంట నివాసం ఉంటున్న ఇంటి గార్డెన్‌ ఏరియాలోకి వచ్చింది. పెరట్లో నిరుపయోగంగా పడి ఉన్న ఓ వలలో ఆ పాము ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గమనించిన దంపతులు వెంటనే పాములను పట్టే వ్యక్తిని పిలిపించారు. ఆ వ్యక్తి ఎలాగోలా వలను కత్తిరించి పామును బయటకు తీశాడు. అయితే పామును తనతో తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేయడం లేదా చంపేస్తానని ఆ వ్యక్తి చెప్పడంతో సెబాస్టియన్‌ జంట దానికి ససేమిరా అన్నారు. ఆ పామును ఎక్కడికి తీసుకెళ్ల వద్దని తామే పెంచుకుంటామని చెప్పారు. దీంతో ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి వారి కోరిక మేరకు పామును అక్కడే వదిలేసి వెళ్లి పోయాడు. సెబాస్టియన్‌ దంపతులు ఆ పామును పెంచుకోవడం ప్రారంభించారు. దానికి అవసరమైన ఆహారం అందిస్తూ దాన్నో పెట్‌ స్నేక్‌లాగా చూసుకుంటున్నారు. దీంతో ఈ విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్యపోవడంతో పాటు ఆ పాము వారిని ఏం చేస్తుందోనని భయపడుతున్నారు. ఏది ఏమైనా ఓ విష సర్పాన్ని పెంచుకోవాలనే ఈ వీదేశీ దంపతుల ఆలోచన నిజంగానే డిఫ్రెంట్‌ కదూ.

Snake

Snake

Snake 1

Snake 1

Also Read: LIC Alert: పాలసీదారులకు ముఖ్య గమనిక..! అలాంటి ఎస్ఎంఎస్ వస్తే స్పందించకండి..!

Old Vehicles: డొక్కు వాహనాలను నడుపుతున్నారా ? అయితే బహుపరాక్‌.. ఇవి నడిపితే ఎంత ట్యాక్స్ పడుతుందో తెలుసా..

అరవాలమ్మ తల్లి జాతరలో అశ్లీల నృత్యాలు.. ఆర్కెస్ట్రా ముసుగులో అసభ్యకర డాన్సులు.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే