బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీలను రాష్ట్రం నుంచి తరిమేస్తారు, మమతా బెనర్జీ హెచ్చరిక.

బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీలను రాష్ట్రం నుంచి తరిమేస్తారని సీఎం,  టీఎంసి అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చ రించారు.  నందిగ్రామ్ లో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ఆమె..

బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీలను రాష్ట్రం నుంచి తరిమేస్తారు, మమతా బెనర్జీ హెచ్చరిక.
West Bengal CM Mamata Banerjee
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 29, 2021 | 6:35 PM

బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీలను రాష్ట్రం నుంచి తరిమేస్తారని సీఎం,  టీఎంసి అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చ రించారు.  నందిగ్రామ్ లో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ఆమె.. మీరు బీజేపీకి ఓటు వేస్తే మిమ్మల్ని బయటి గూండాలతో తరిమివేయిస్తారని, వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతి దాన్నీ స్వాధీనం చేసుకుంటారని అన్నారు.చివరకు ఈ రాష్ట్ర మనుగడను కూడా లాగేసుకుంటారన్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ కి ఓటు వేస్తే మీకు మీ ఇంటివద్దే రేషన్ అందుతుంది అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాలీల ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఆమె పేర్కొన్నారు.  నందిగ్రామ్ లో నేను గెలిస్తే నా కార్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తాను అని మమత పేర్కొన్నారు. ఈ ఆటలో మనం గెలవాలని, బీజేపీ గూండాగిరి చేస్తే వారిని చీపుర్లతో తరమాలని ఆమె కోరారు. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఇంకా ఆందోళన చేస్తున్నారని, నరేంద్ర మోదీ, బీజేపీనేతలు  వారి భూములను లాక్కునేందుకు యత్నిస్తున్నారని,  ఈ రాష్ట్రాన్ని వారి దోపిడీ నుంచి రక్షించాల్సి ఉందని ఆమె చెప్పారు.  మహిళలు టీఎంసీకే ఓటు వేయాలని ఆమె  కోరారు.

తాను తన పేరును మర్చిపోవచ్చు గానీ నందిగ్రామ్ పేరును మాత్రం  మర్చిపోనన్నారు.  ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ వంటివి జరగకుండా చూడాలని మమత విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఆమె 8 కిలోమీటర్ల దూరం తన వీల్ చైర్ పై ప్రయాణించి ఈ నియోజకవర్గం చేరుకున్నారు. కాగా- ఈద్ ముబారక్ అంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యను బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి అపహాస్యం చేశారు. మైనారిటీలను బుజ్జగించడానికి… ఆమె ఇలా వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఎన్నికల్లో ఎవరు, ఎలాంటివారో ఓటర్లకు తెలుసునన్నారు. మరిన్ని చదవండి ఇక్కడ :pawan kalyan Vakeel Saab Trailer:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ లాంచ్ ( వీడియో ).

Chasing Video :బస్సును చేజ్ చెయ్..అంటు బైకర్ ను ఆపి రిక్వెస్ట్ చేసిన పోలీస్..( వీడియో ).