Wrestlers protest: బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్‌ చేయాల్సిందే.. అంతర్జాతీయ స్థాయికి పోరాటం.. కేంద్రానికి రెజ్లర్ల అల్లిమేటమ్‌..

ఢిల్లీలో నెలరోజులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన రెజ్లర్లు.. ఆయన్న వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, అంతర్జాతీయ స్థాయిలో పోరాటం చేస్తానని హెచ్చరించారు.

Wrestlers protest: బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్‌ చేయాల్సిందే.. అంతర్జాతీయ స్థాయికి పోరాటం.. కేంద్రానికి రెజ్లర్ల అల్లిమేటమ్‌..
Wrestlers Protest
Follow us

|

Updated on: May 21, 2023 | 9:40 PM

ఢిల్లీలో నెలరోజులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన రెజ్లర్లు.. ఆయన్న వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, అంతర్జాతీయ స్థాయిలో పోరాటం చేస్తానని హెచ్చరించారు. రెజ్లర్లకు మద్దతుగా హర్యానాలోని రోహతక్‌లో ఖాప్ పంచాయత్ నిర్వహించారు.

బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్‌ చేయాలని ఏప్రిల్ 23వ తేదీ నుంచి బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్‌తో పాటు గోల్డ్ మెడల్ సాధించిన వినేష్ ఫోగట్ జంతర్‌ మంతర్‌ దగ్గర ధర్నా చేస్తున్నారు. పహిల్వాన్ల ఆందోళనకు ప్రతిపక్షాలతో పాటు పలు రైతు సంఘాల మద్దతు కూడా లభించింది. ఇప్పుడు వాళ్ల ఆందోళనల్ని మరింత ఉద్దృతం చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తమ డిమాండ్‌లను వినిపిస్తామని స్పష్టం చేశారు. ఇతర దేశాల్లోనూ ఒలింపిక్ మెడల్స్ సాధించిన వారందరి సపోర్ట్ కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు..

గత వారమే ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. అయితే…ఇప్పటి వరకూ కేసు ఇంకా కోర్టుల్లోనే నలుగుతోంది తప్ప తమకు న్యాయం జరగడం లేదని మండి పడుతున్నారు రెజ్లర్లు. లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ మరోసారి స్పందించారు. తనపై వచ్చిన ఏ ఆరోపణ నిజమని తేలినా ఉరి వేసుకుని చచ్చిపోతానని వెల్లడించారు. అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. జూన్‌ 5వ తేదీన అయోధ్యతో సాధువులు తనకు మద్దతుగా సభను ఏర్నాటు చేశారన్నారు.

ఇవి కూడా చదవండి

బ్రిజ్‌భూషణ్‌ తీరుపై మండిపడుతున్నారు రెజ్లర్లు. అధికారం ఉందన్న ధీమాతో తనను ఎవరు ఏంచేయలేరని ఆయన అనుకుంటున్నారని మండిపడుతున్నారు. తమ లక్ష్యం నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..