polluted cities: ప్రపంచంలోని టాప్ 5 కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఫస్ట్.. రెండో స్థానంలో లాహోర్..
polluted cities: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. పాకిస్థాన్‌లోని లాహోర్ నగరం రెండో స్థానంలో ఉంది. స్థానిక మీడియా నివేదిక ప్రకారం..
polluted cities: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. పాకిస్థాన్‌లోని లాహోర్ నగరం రెండో స్థానంలో ఉంది. స్థానిక మీడియా నివేదిక ప్రకారం.. లాహోర్‌లో పార్టిక్యులేట్ మ్యాటర్ (PM) రేటింగ్ 188గా నమోదైంది. దేశంలోని పర్యావరణ నిపుణులు కాలుష్యానికి పంటలను కాల్చడమే కాకుండా రవాణా రంగం, పరిశ్రమలను నిందిస్తున్నారు. లాహోర్ పర్యావేరణ వేత్త ఒకరు ఇలా ట్వీట్ చేశారు. ‘లాహోర్‌లో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉంది. ఈ కాలుష్యం వల్ల ఆరోగ్యంగా ఉండటం చాలా కష్టంగా మారుతోంది. ఇక్కడ స్థిరపడాలనుకునే వారందరూ తమ నిర్ణయాన్ని పునరాలోచించి వేరే చోట స్థిర పడటానికి ప్లాన్ చేసుకోవాలి. లాహోర్‌ని రాజధాని నగరంగా మార్చడాన్ని కూడా పునరాలోచించాలి’ అన్నారు.
ఈ ఏడాది మార్చిలో IQAir గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ పాకిస్తాన్‌ని రెండో అత్యంత కాలుష్య దేశంగా గుర్తించింది. యుఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విడుదల చేసిన వాయు కాలుష్య డేటా ప్రకారం.. ఈ జాబితాలో భారతదేశంలోని ఢిల్లీ (ఢిల్లీ వాయు కాలుష్యం) రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. కాగా కిర్గిస్థాన్‌కు చెందిన బిష్కెక్ మూడో స్థానంలో ఉంది. భారతదేశంలోని కోల్‌కతా నాలుగో అత్యంత కాలుష్య నగరంగా, చైనాలోని బీజింగ్ ఐదో అత్యంత కాలుష్య నగరంగా ఉన్నాయి.
అదే సమయంలో ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో మీరట్ రెండో అత్యంత కాలుష్య నగరంగా ఉంది. చైనా డెంగ్ట్లూ తర్వాత మీరట్ అగ్రస్థానంలో ఉంది. అయితే వాయు కాలుష్యాన్ని బట్టి రియల్ టైమ్ గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దీని తర్వాత చైనా నగరాలు హువాంగ్‌లాంగ్సీ (368), షాన్‌చెంగ్ (352), హెబీ (349), షాంగ్‌క్యూ (349), హెజ్ (347), పింగ్డు (326), నంగండావో (324) మరియు జియాన్ (313) అత్యధిక కాలుష్యం కలిగిన నగరాలుగా గుర్తించారు.