Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలెర్ట్.. ఈ నెల 8 నుంచి అమల్లోకి ఆ రూల్.!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక. బయోమెట్రిక్ అటెండెన్స్ విషయంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8వ తేదీ..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక. బయోమెట్రిక్ అటెండెన్స్ విషయంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే అన్ని స్థాయిలలోని ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. అలాగే బయోమెట్రిక్ మెషిన్ల పక్కనే శానిటైజర్లు ఉండేలా చూసుకోవాలని విభాగాధిపతులను సూచించింది. కరోనా వ్యాప్తి కారణంగా ఉద్యోగులకు గతంలో బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వగా.. ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది.
“ఉద్యోగులందరూ బయోమెట్రిక్ హాజరు వేసేటప్పుడు ఆరు అడుగుల భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. అవసరమైతే రద్దీని నివారించేందుకు అదనపు బయోమెట్రిక్ మెషిన్లను కూడా అమర్చండి” అని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఉద్యోగులందరూ అన్ని సమయాల్లోనూ మాస్క్‌లు, లేదా ఫేస్ కవర్లను ధరించాలని సూచించింది.