AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Deaths: కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎందరిని బలితీసుకుందో తెలుసా..?

కోవిడ్ ఇది ప్రపంచాన్ని గడగడలాడించిన పదం. చైనాలో పుట్టిని ఈ మహమ్మారి యవత్ ప్రపంచాన్ని వణికించింది. దీని వల్ల మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5 మిలియన్లకు చేరుకుంది...

Covid Deaths: కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎందరిని బలితీసుకుందో తెలుసా..?
Covid
Srinivas Chekkilla
|

Updated on: Nov 01, 2021 | 6:07 PM

Share

కోవిడ్ ఇది ప్రపంచాన్ని గడగడలాడించిన పదం. చైనాలో పుట్టిని ఈ మహమ్మారి యవత్ ప్రపంచాన్ని వణికించింది. దీని వల్ల మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5 మిలియన్లకు చేరుకుంది. అంటే ఈ మహమ్మారి సోకి 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది పేదలను నాశనం చేయడమే కాకుండా సంపన్నులను కూడా సంక్షోభంలోకి నెట్టింది. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, బ్రెజిల్ వంటి మధ్య లేదా అధిక ఆదాయ దేశాలు ప్రపంచ జనాభాలో ఎనిమిదవ వంతు వాటాను కలిగి ఉన్నాయి. అయితే అమెరికాలోనే దాదాపు 7,40,000 మరణాలు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది మిగతా దేశాల కంటే ఎక్కువ.

జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం మృతుల సంఖ్య లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో జనాభాతో సమానంగా ఉంది. పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓస్లో అంచనాల ప్రకారం, 1950 నుండి దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో మరణించిన వారి సంఖ్యతో దాదాపు సమానంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ తర్వాత COVID-19 ఇప్పుడు మరణాలకు మూడవ ప్రధాన కారణంగా ఉంది. పరిమిత పరీక్షలు, ప్రజలకు వైద్య సహాయం లేకుండా ఇంట్లోనే చనిపోయారు. ముఖ్యంగా పేద ప్రాంతాలు ఎక్కువగా ఉండే భారతదేశంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ వైరస్ రష్యా, ఉక్రెయిన్, తూర్పు ఐరోపాలోని పలు ప్రాంతాల్లో విజృంభిస్తోంది. ఉక్రెయిన్‌లోజనాభాలో కేవలం 17 శాతం మంది పెద్దలు మాత్రమే పూర్తిగా టీకాలు వేసుకోగా అర్మేనియాలో ఇది 7 శాతం మాత్రమే.

“ఈ మహమ్మారి గురించి ప్రత్యేకంగా అధిక వనరులను కలిగి ఉన్న దేశాలను తీవ్రంగా దెబ్బతీసింది” అని కొలంబియా విశ్వవిద్యాలయంలోని గ్లోబల్ హెల్త్ సెంటర్ అయిన ICAP డైరెక్టర్ డాక్టర్ వఫా ఎల్-సదర్ అన్నారు. భారతదేశంలో భయంకరమైన డెల్టా ఉప్పెన మే ప్రారంభంలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ గణాంకాలపై అనిశ్చితి నెలకొంది. సంపన్న రష్యా, యు.ఎస్ లేదా బ్రిటన్ కంటే దేశంలో రోజువారీ మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ప్రపంచ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో సంపద కూడా పాత్ర పోషించింది. ధనిక దేశాలు సరఫరాలను లాక్ చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. సంపన్న దేశాలు కూడా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వందల మిలియన్ల షాట్‌లను షిప్పింగ్ చేస్తున్నప్పటికీ, ఆఫ్రికా అంతటా మిలియన్ల మంది ఒక్క డోస్ కూడా అందులేదు. దేశంలో ఆసుపత్రులలో ఆక్సిజన్, ఔషధాలు లేక పదివేల మంది మృత్యువాత పడ్డారు.

Read Also.. Real Life Mowgli: నెటిజన్లు తలచుకుంటే ఏమైనా చేయగలరు.. అడవిలోని మోగ్లీకి.. మళ్ళీ లైఫ్.. స్కూల్‌కు వెళ్తున్న ఫోటోలు వైరల్