AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VVS Laxman Birthday: జట్టుకు ఆపద్భాంధవుడతడు.. అతను ఆడిన ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది..

భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈరోజు తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. లక్ష్మణ్ జట్టు విపత్కర పరిస్థితుల్లో చాలాసార్లు ఆదుకున్నాడు. తన బ్యాటింగ్‎తో ఇండియాకు విజయాలను అందించారు...

VVS Laxman Birthday: జట్టుకు ఆపద్భాంధవుడతడు.. అతను ఆడిన ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది..
Laxman
Srinivas Chekkilla
|

Updated on: Nov 01, 2021 | 5:41 PM

Share

భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈరోజు తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. లక్ష్మణ్ జట్టు విపత్కర పరిస్థితుల్లో చాలాసార్లు ఆదుకున్నాడు. తన బ్యాటింగ్‎తో ఇండియాకు విజయాలను అందించారు. లక్ష్మణ్ తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో కొన్ని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతను ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ అందరికి గుర్తుంటుంది. 2001లో కల్‎కత్తాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై 281 పరుగులతో చారిత్రక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ టెస్ట్ క్రికెట్ చరిత్లో గొప్పదిగా నిలిచింది.

ఆ టెస్ట్ మ్యాచ్‎లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చేలాయిస్తుంది. అంతేకాదు ఇండియా తొలి టెస్టులో ఓడిపోయి ఒత్తిడిలో ఉంది. భారత్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 445 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇండియా ఫాలోఆన్‌ను ఆడాల్సి వచ్చింది. రెండో ఇన్సింగ్స్‎లో భారత ఓపెనర్లు త్వరగానే ఔటయ్యారు. అప్పుడు క్రీజులో రాహుల్ ద్రవిడ్‌కి తోడు వీవీఎస్ లక్ష్మణ్‌ ఉన్నాడు. ఆ తర్వాత అద్భుతం జరిగింది. ఆస్ట్రేలియాలో షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్ వంటి దిగ్గజాలు ఉన్నా వారిని నిర్వీర్యం చేస్తూ వీరిద్దరూ కలిసి 376 భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‎లో లక్ష్మణ్ 281​​పరుగులు చేశాడు. ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. లక్ష్మణ్ అద్భుత ఇన్నింగ్స్‎తో భారత్ ఘన విజయం సాధించింది. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇది భారత క్రికెట్ చరిత్రలో కూడా గొప్ప ఇన్నింగ్స్‎గా మిగిలిపోయింది. తర్వాత 2004లో వీరేంద్ర సెహ్వాగ్ ఈ రికార్డును బద్దలు కొట్టే వరకు లక్ష్మణ్ రికార్డు అలాగే ఉంది. పాకిస్థాన్‌పై లక్ష్మణ్ 104 పరుగులు గొప్ప ఇన్నింగ్స్‎గా నిలిచింది. 2004లో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో2-2తో పాక్, భారత్ సమాన స్థితిలో ఉన్నాయి. లాహోర్‌లో జరిగిన చివరి నిర్ణయాత్మకమైన మ్యాచ్‎లో ఇండియా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నా లక్ష్మణ్ 104 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

లక్ష్మణ్ ఎక్కువగా ఆస్ట్రేలియాపై ఆడేవాడు. 2010 రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో లక్ష్మణ్ 73 పరుగులు చేశాడు. విజయానికి 216 పరుగులు చేయాల్సి ఉండగా భారత్ ముఖ్యమైన వికెట్లను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. లక్ష్మణ్‌కు సహకరించేవారు కరవయ్యారు. అదృష్టవశాత్తూ, అతను ఇషాంత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజాలో మద్దతుతో మరో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. వీవీఎస్ లక్ష్మణ్ 2012లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. లక్ష్మణ్ 134 టెస్టులు 8,781 పరుగులు చేయగా.. 86 వన్డేల్లో 2,338 పరుగులు సాధించాడు.

Read Also.. Michael Vaughan: విదేశీ లీగ్‎ల్లో భారత ఆటగాళ్లను ఆడనివ్వాలి.. అప్పుడే అలాంటి పిచ్‎లను అర్థం చేసుకుంటారు..