Monkeypox: మంకీపాక్స్‌ కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు..!

Monkeypox: గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి ప్రజలను ఆందోళనకు గురి చేసింది. కరోనా నుంచి కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి భయాందోళనకు గురి చేస్తోంది..

Monkeypox: మంకీపాక్స్‌ కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 06, 2022 | 5:17 AM

Monkeypox: గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి ప్రజలను ఆందోళనకు గురి చేసింది. కరోనా నుంచి కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి భయాందోళనకు గురి చేస్తోంది. కోవిడ్‌ బారిన ఎందరో ప్రాణాలు విడిచిపోగా, దారి బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నవారు చాలానే ఉన్నారు. ఇక కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందనుకుంటే మరో వైరస్ కలవరపెడుతోంది. అదే మంకీపాక్స్‌. వివిధ దేశాల్లో మంకీపాక్స్ కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తాజాగా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 27 దేశాల్లో 780 కేసులు నమోదైన నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టానలి డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో అధికారిణి మరియా వాన్ కెర్‌ఖోవ్ మాట్లాడుతూ.. అసలు మంకీపాక్స్ అంటే ఏంటి? నివారణ చర్యలు తదితర అంశాలపై ముందుగా అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.

మంకీపాక్స్‌ అంటే ఏమిటి..? ఇది ఎలా వ్యాపిస్తుంది తదితర అంశాలపై వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడుతోంది. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని, ఈ వైరస్‌ ఉన్న వారిలో ఇతరులు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా లేకపోతే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ప్రమాదం ఉందని చెబుతోంది. వైద్య సదుపాయాల సాయంతో వైరస్‌ను ముందుగా గుర్తించగలిగే స్థితిలో ఉన్నాం. అనుమానితులతోపాటు వారిని కలిసినవారిని ఐసొలేషన్‌ చేయడం వంటి చర్యలు ఎంతో ముఖ్యమని చెబుతోంది డబ్ల్యూహెచ్‌వో.

ఈ వైరల్‌ వ్యాధి చికిత్స కోసం అవసరమైన అన్ని పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని యాంటీవైరల్స్‌, వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి వినియోగం విషయంలో జాగ్రత్తలు ఎంతో అవసరం. వైరస్‌ గురించి పూర్తి సమాచారాన్ని పరిశీలించాలి. ఈ నేపథ్యంలో అంటువ్యాధులకు సంబంధించి అంతర్జాతీయ నిపుణులు, పరిశోధన సంస్థలతో ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి