Uttarkashi Bus Accident: ఘోరం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు ప్రమాదంలో 22 మంది మృతి
Uttarkashi Bus Accident: రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అజాగ్రత్తగా, మద్యం తాగి వాహనాలు నడపడం..
Uttarkashi Bus Accident: రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అజాగ్రత్తగా, మద్యం తాగి వాహనాలు నడపడం, ఒవర్‌టెక్, అతివేగం తదితర కారణాల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమదాలతో అమాయకుల ప్రాణాలు గాల్లో కాలిసిపోతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం అందరిని కలిచివేసింది. ఉత్తరకాశీ జిల్లా దుమ్టాలో ఓ బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాక చర్యలు చేపట్టరు. ఇప్పటి వరకు 22 మంది మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 28 మంది ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన యాత్రికులు యమునోత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అక్కడ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
#WATCH | Uttarakhand: Visuals from the gorge in Uttarkashi district where a bus carrying 28 pilgrims fell down. 22 pilgrims have died & 6 people have been injured. Local administration & SDRF teams engaged in rescue work; NDRF team rushing to spot. pic.twitter.com/g0KDBRdDMe
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 5, 2022
రోడ్డు ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. తమ అధికారుల బృందం ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో నిరంతరం టచ్‌లో ఉందని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.
Uttarakhand | CM Pushkar Singh Dhami reached Disaster Control Room in Dehradun pertaining to a bus accident in Uttarkashi dist. He directed the district administration to carry out relief & rescue work expeditiously along with proper treatment of the injured: CMO pic.twitter.com/IkRro1dHxC
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 5, 2022
ప్రమాదం గురించి తెలియగానే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లోని డిజాస్టర్ కంట్రోల్ రూమ్‌కు చేరుకున్నారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించడంతో పాటు సహాయ, సహాయక చర్యలను త్వరితగతిన చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాద స్థలం రోధనలతో మిన్నంటాయి.
#Update | Uttarakhand: 15 bodies have been recovered so far after a bus carrying 28 pilgrims fell into a gorge near Damta in Uttarkashi district: DGP Ashok Kumar
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 5, 2022
జరిగిన ప్రమాదంపై విచారణకు ఆదేశించింది అక్కడి ప్రభుత్వం. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించాలని ఆదేశించింది. మరణించిన వారి కుటుంబాలను, గాయపడిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదం వివరాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి