Hyderabad Rape Case: రేప్ కేసు గంటగంటకు క్రైమ్ థ్రిల్లర్.. కీలకంగా మారిన బెంజ్‌, ఇన్నోవా కార్లు..

హైదరాబాద్‌లో సంచలనం రేపిన మైనర్ బాలిక కేసును వేగంవంతం చేశారు పోలీసులు. కేసులో కీలకంగా మారిన కార్లలో ఫోరెన్సిక్ టీమ్ ధర్యాప్తు చేసింది. ఆధారాలను సేకరించింది.

Hyderabad Rape Case: రేప్ కేసు గంటగంటకు క్రైమ్ థ్రిల్లర్.. కీలకంగా మారిన బెంజ్‌, ఇన్నోవా కార్లు..
Rape Case
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 05, 2022 | 8:02 PM

జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో సైన్టిఫిక్ ఎవిడెన్స్ కోసం ఫోరెన్సిక్ నిపుణులు జూబ్లీ హిల్స్ పోలీస్టేషన్ లో ఉన్న బెంజ్, ఇన్నోవా కార్లను పరిశీలించారు. కేసులో సీజ్ చేసిన బెంజ్ కారుని క్లూస్ టీం పరిశీలించింది. బెంజ్‌ కారులో బాధితురాలి చెప్పు, వెంట్రుకలు, చెవిరింగ్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే అత్యాచారం చేసిన ఇన్నోవా కారులో ఫింగర్ ప్రింట్స్ ను సేకరించింది క్లూస్ టీం. మరోవైపు గ్యాంగ్‌ రేప్ కేసు గంటగంటకు క్రైమ్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. ఎమ్మెల్యే రఘునందన్‌ రిలీజ్‌ చేసిన ఆధారాల్లో ఎమ్మెల్యే కొడుకు వీడియోను పరిశీలించారు పోలీసులు. వీడియోను లీగల్‌ ఒపీనియన్‌కు పంపించారు జూబ్లీహిల్స్‌ పోలీసులు. లీగల్ ఒపీనియన్, పోలీసుల విచారణ ఈ కేసులో కీలకంగా మారనుంది. వీడియోను ఆధారంగా పాతబస్తీకి చెందిన ఓ ఎమ్మెల్యే కొడుకు పేరును FIRలో చేర్చే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే ఎమ్మెల్యే కొడుకును నిందితుడిగా చేరిస్తే నేరస్తుల సంఖ్య ఆరుకు చేరుతుంది. ఎమ్మెల్యే కుమారుడు విదేశాలకు పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. అతడి జాడ కోసం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరోవైపు అమ్నేషియా పబ్ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రేప్‌ కేసులో నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా గుర్తించారు పోలీసులు. ఏ 1 నుంచి ఏ6 వరకూ పొలిటికల్‌ పుత్ర రత్నాలేనని చెబుతున్నారు పోలీసులు. వీరందరూ ఒకే పార్టీకి చెందిన నేతల కుమారులు కావడంతో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది.

ఈ కేసులో A5 నిందితుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని మైనర్ నిందితుడు స్టేట్మెంట్ రికార్డు చేశారు. మైనర్ ను జువైనల్ హోమ్ కి తరలించారు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు.. లైంగిక దాడి అనంతరం కారులో మొయినాబాద్కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్లో ఆశ్రయం పొందారు. ఫామ్ హౌస్ లో మందు పార్టీ చేసుకున్నారు. యువకులు ఎంజాయ్ చేస్తూ, వీడియోలను వాట్సప్ గ్రూప్స్ లలో, అలాగే స్నేహితులకు షేర్ చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులు తీసుకున్న వీడియోలు వాట్సప్‌ స్టేటస్ పెట్టుకోవడంతో వాటి డౌన్ లోడ్ చేసి వైరల్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఘటన జరిగిన తరువాత నిందితులు పోలీసులు పక్కదోవ పట్టించేలా వ్యవహరించారు. తాము గోవా పోతున్నామని చెప్పి, వారి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ వారి ఫ్రెండ్స్ ఇచ్చి, మరో ఫోన్, సిమ్ తీసుకోని దొరకకుండా కర్ణాటక కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

ఇక పోలీసులు చెపుతున్న దానికి వాస్తవాలకు బిన్నంగా ఉండడంతో దర్యాప్తు పై అనేక అనుమాలు కలుగుతున్నాయి. దీంతో కేసును విచారణ కోసం ఓ ఏసీపీ స్థాయి అధికారికి అప్పగించి విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇక ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు చేయకపోతే కోర్ట్ మెట్లు ఎక్కుతామని హెచ్చరిస్తున్నారు బీజేపీ నేతలు.

మరోవైపు రేప్ కేసుపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై స్పందించారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సీఎస్‌, డీజీపీని ఆదేశించారు. 2 రోజుల్లో నివేదికను అందించాలని ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?