Cattle Theft: ఖాకీల కర్కశత్వం! పశువుల దొంగతనం కేసుపెట్టి పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలు.. కరెంటుషాకిచ్చి ఆపై..
పశువులను దొంగిలించాడనే (cattle theft) నెపంతో ఓ యువకుడిని పోలీసులు విచక్షణారహితంగా చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న యువకుడి బంధువులు పై అధికారులకు సదరు పోలీసులపై ఫిర్యాదు చేశారు. దీంతో..
UP cops tortured Muslim Vendor in police station: పశువులను దొంగిలించాడనే (cattle theft) నెపంతో ఓ యువకుడిని పోలీసులు విచక్షణారహితంగా చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న యువకుడి బంధువులు పై అధికారులకు సదరు పోలీసులపై ఫిర్యాదు చేశారు. దీంతో స్టేషన్ ఇన్‌ఛార్జితోసహా 7 పోలీసులపై కేసు నమోదవ్వగా.. ఐదుగురు సస్పెండ్ అయ్యారు. అధికారిక సమాచారం ప్రకారం..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో దినసరి కూలీగా పని చేసే రెహాన్ అనే యువకుడిని (20) మే 2న పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. పశువుల స్మగ్లర్ల గుంపుకు చెందిన వాడనే అనుమానంతో బదౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని గంటల పాటు పోలీసుల అదుపులో ఉన్న యువకుడిని పోలీసులు కరెంట్ షాక్ ఇచ్చి, కర్రలతో విచక్షణా రహితంగా కొట్టరని, దీంతో యువకుడి ప్రైవేట్ పార్టుల్లో తీవ్ర గాయాలయ్యాయి. నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, జిల్లా ఆసుపత్రికి తరలించినా ప్రయోజనంలేకపోయింది. దీంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బులంద్‌షహర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు కుంటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. అంతేకాకుండా అతన్ని విడిపించడానికి పోలీసులు తమ వద్ద రూ.5000ల లంచం కూడా తీసుకున్నట్లు ఆరోపించారు.
ఈ కేసులో లభ్యమైన ప్రాథమిక సమాచారం ప్రకారం రెహాన్ ప్రస్తుతం బులంద్‌షహర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఏడుగురు పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు అవ్వగా, వారిలో ఐదుగురు పోలీసులు సస్పెండయ్యారు. ఈ కేసులో సమగ్ర విచారణ కొనసాగుతుందని సీనియర్ పోలీస్ అధికారి ప్రవీణ్ సింగ్ చౌహాన్ మీడియాకు తెలిపారు.
5 UP cops torture man, insert stick in rectum, give electric shock UP’s Budaun https://t.co/FXitnJZP9y@kavita_krishnan @timesofindia pic.twitter.com/5bxuhMCxUY
— Kanwardeep singh (@KanwardeepsTOI) June 5, 2022