Andhra Pradesh: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతిపై అనుమానాలు..? అదే కారణమంటున్న నిర్మల కుటుంబీకులు..
Software Engineer Nirmala: పెళ్లయిన ఏడాదిన్నర లోపే అకాల మరణం చెంది విగతజీవిగా మారడంతో.. ఆమె భర్త, అత్తమామలపై సందేహం వెలిబుచ్చారు కుటుంబీకులు. నిర్మలకు రెండేళ్ల కిందట భార్గవ్‌తో పెళ్లయింది.
విజయనగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్(software engineer) నిర్మల(Nirmala) మృతి అనుమానాస్పదంగా మారింది. వరకట్న వేధింపులే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆమె కుటుంబీకులు. పెళ్లయిన ఏడాదిన్నర లోపే అకాల మరణం చెంది విగతజీవిగా మారడంతో.. ఆమె భర్త, అత్తమామలపై సందేహం వెలిబుచ్చారు కుటుంబీకులు. నిర్మలకు రెండేళ్ల కిందట భార్గవ్‌తో పెళ్లయింది. బంగారం, వెండితో పాటు భారీగానే డబ్బు ఇచ్చారు అమ్మాయి తల్లిదండ్రులు. నిన్న రాత్రి భర్త ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది నిర్మల. అదనపు కట్నం కోసం భర్త. అత్తమామలు వేధించడంతోనే నిర్మల సూయిసైడ్ చేసుందనే ఆరోపణలొస్తున్నాయి. తమ కుమార్తెను హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారి వాపోతున్నారు నిర్మల తల్లిదండ్రులు.
నిర్మల మృతదేహంతో నిరసనకు దిగారు ఆమె కుటుంబీకులు. వీరికి మహిళా సంఘం ఐద్వా బాసటగా నిలబడింది. నటరాజ్ కాలనీలోని భర్త భార్గవ్ ఇంటి ముందే మృతదేహాన్ని ఉంచి.. నినాదాలు చేశారు. వెంటనే భార్గవ్‌ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల మరణం స్థానికంగా సంచలనంగా మారింది.