Weight Loss: జామాకులతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాకవ్వాల్సిందే

Guava Leaves for Weight Loss: జామపండును తినని వారంటూ అస్సలు ఉండరు. రుచితోపాటు జామలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. రోజూ జామపండు తినడం ఆరోగ్యానికి చాలా..

Weight Loss: జామాకులతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాకవ్వాల్సిందే
Follow us
Subhash Goud

|

Updated on: Jun 04, 2022 | 9:42 PM

Guava Leaves for Weight Loss: జామపండును తినని వారంటూ అస్సలు ఉండరు. రుచితోపాటు జామలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. రోజూ జామపండు తినడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇది జీర్ణక్రియ, అనేక ఇతర సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే జామ ఆకులు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయన్న విషయం మీకు తెలుసా..? ఒకవేళ తెలియకపోతే.. ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జామ ఆకుల వల్ల ప్రధానంగా ఐదు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి మేలు చేసే ఔషధ గుణాలు జామ ఆకుల్లో పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకు వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గడంలో సహాయపడుతుంది..

కాంప్లెక్స్ స్టార్చ్ చక్కెరగా మారినప్పుడు.. బరువు పెరగడం ప్రారంభమవుతుంది. జామ ఆకులు బరువు తగ్గడానికి దారితీసే ఈ ప్రక్రియను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే ఈ ఆకులకు కార్బోహైడ్రేట్లను తగ్గించే శక్తి ఉంది. అందుకే వీటిని తింటే ఊబకాయం దూరం అవుతుంది.

ఇవి కూడా చదవండి

అతిసారం దూరమవుతుంది..

జామ ఆకులు అతిసారం సమస్యను అరికట్టడంలో సహాయపడతాయి. దీని కోసం అరకప్పు బియ్యం పిండిని, అలాగే జామ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి రోజుకు రెండుసార్లు తాగితే ఈ సమస్యతో పాటు బరువు కూడా తగ్గుతుంది.

కొలెస్ట్రాల్ స్థాయి

ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీని కోసం మీరు జామ ఆకుల టీ తాగడం ప్రారంభించడం మంచిది. మీరు కొన్ని నెలలు ఇలా చేస్తే.. బరువు సమస్య గణనీయంగా తగ్గుతుంది.

జుట్టుకు మంచిది

జామ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. జామ ఆకులను మెత్తగా నూరి తలకు పట్టిస్తే జుట్టు సిల్కీగా, నిగనిగలాడుతుంది.

డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది..

జామ ఆకుల నుంచి తయారైన టీ ఆల్ఫా-గ్లూకోసిడేస్ ఎంజైమ్ చర్యను తగ్గించడం ద్వారా డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కోసం జామ ఆకుల టీని సుమారు 3 నెలల పాటు ప్రతిరోజూ తాగాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా