Woman deadbody : బెంగళూరులో దారుణం.. రైల్వే స్టేషన్ వద్ద ప్లాస్టిక్ డ్రమ్ములో దొరికిన మహిళ మృతదేహం
బెంగళూరులోని ఓ రైల్వే స్టేషన్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ డ్రమ్ములో ఓ మహిళ మృతదేహం ఉండటం చూసి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

బెంగళూరులోని ఓ రైల్వే స్టేషన్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ డ్రమ్ములో ఓ మహిళ మృతదేహం ఉండటం చూసి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బెంగళూరు రైల్వే స్టేషన్ లో ఇలా డ్రమ్ములో మృతదేహం లభించడం ఇది రెండోసారి కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య బైయ్యప్పనహలి రైల్వే స్టేషన్ ఎంట్రీ గేట్ వద్ద ప్రయాణికులు అనుమానస్పదంగా ఈ డ్రమ్ ఉండటాన్ని గుర్తించారు. అది కూడా మూతపెట్టి బట్టలతో కప్పి ఉంది. పోలీసులకు సమాచారం అందించగా వారు అందులో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆ మహిళ ఎవరో గుర్తించకపోయినప్పటికీ ఆమెకు దాదాపు 31 నుంచి 35 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించగా ఇందులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ముగ్గురు వ్యక్తులు ఈ డ్రమ్ ను ఆటోరిక్షాలో తీసుకొచ్చారని, ఆ తర్వాత రైల్వే స్టేషన్ ఎంట్రీ గేటు వద్ద దాన్ని వదిలేసి వెళ్లిపోయారని గుర్తించారు. ఈ మృతదేహాన్ని కూడా దుండగులు మచిలీపట్నం నుంచి రైల్లో తీసుకొచ్చారని వెల్లడించారు. ఆ మృతదేహం ఎవరిదో కనుక్కోనేందుకు మచిలీపట్నానికి పోలీస్ బృందానికి పంపించినప్పటికీ ఆమె ఎవరో గుర్తించలేకపోయామని సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ సౌమ్లత తెలిపారు. ఇదిలా ఉండగా రెండు నెలల క్రితమే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం మరో అనుమానాలకు దారితీస్తోంది. సరిగ్గా ఇలానే ఈ ఏడాది జనవరి 4 యెశ్వంత్ పూర్ రైల్వే స్టేషన్ లో ఓ వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




