AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కావాలనే అలాంటి సీన్లు చేయిస్తారు.. కథలో లేకపోయినా రొమాంటిక్ సీన్స్ చేయమంటారు.. హీరోయిన్ ఆవేదన..

సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇందులో రాణించాలంటే ప్రతిభతోపాటు ఫిట్నెస్, గ్లామర్ లుక్స్ సైతం అవసరమే. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి స్టార్ డమ్ రాదు. కొందరు ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. మరికొందరు మాత్రం దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోలేరు. తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Tollywood: కావాలనే అలాంటి సీన్లు చేయిస్తారు.. కథలో లేకపోయినా రొమాంటిక్ సీన్స్ చేయమంటారు.. హీరోయిన్ ఆవేదన..
Zareena Khan
Rajitha Chanti
|

Updated on: Mar 17, 2026 | 8:14 AM

Share

సినీరంగుల ప్రపంచంలో రాణించాలని చాలా మంది అనుకుంటారు. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే పరిశ్రమకు దూరమవుతుంటారు. నటిగా ప్రశంసలు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన తారలు చాలా మంది ఉన్నారు. అందులో బాలీవుడ్ నటి జరీనా ఖాన్ ఒకరు. సల్మాన్ ఖాన్ నటించిన వీర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ అందం, అభినయంతో ఈ అమ్మడు అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. కానీ స్టార్ డమ్ అందుకోలేకపోయింది. వీర్ సినిమా తర్వాత హౌస్ ఫుల్ 2, హేట్ స్టోరీ 3 వంటి చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా హేట్ స్టోరీ 3లో బోల్డ్ సీన్లలో రెచ్చిపోయింది. ఆ తర్వాత తనను తక్కువగా చూడడం ప్రారంభించారని చెప్పుకొచ్చింది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

ఈ సినిమా తర్వాత తనకు నటించడం రాదు కాబట్టే.. ఇలా దుస్తులు విప్పే సీన్స్ చేస్తుందని కామెంట్స్ చేశారని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఒక సినిమా కారణంగా తనపై తప్పుగా ముద్ర పడిందని చెప్పుకొచ్చింది. అలాగే అక్సర్ 2 చిత్రం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ముందుగా నోయర్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుందని కథ చెప్పారని.. కానీ అక్కడికి వెళ్లాక.. స్టోరీ పూర్తిగా మార్చేశారని తెలిపింది. సెట్ కు వెళ్లిన ప్రతీసారి సీన్లలో అనుకోకుండానే బోల్డ్ సీన్లు జోడించేవారని.. ముద్దు సీన్స్ యాడ్ చేసేవారని పేర్కొంది. ముందుగా చెప్పిన కథకు పూర్తి భిన్నంగా సినిమా తీశారని చెప్పుకొచ్చింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

సడెన్ గా దుస్తులు తీసేయాలని అంటారు.. పొట్టి దుస్తులు ధరించాలని అంటారు.. నా బాధ ఎవరూ అర్థం చేసుకోరు. కథ చెప్పినప్పుడు ఒకరకంగా ఉండి.. తర్వాత మరోరకంగా షూటింగ్ చేస్తారని అన్నారు. అదే విషయాన్ని వాళ్లతో చెప్పానని.. ఇలాంటి సన్నివేశాలు చేయడం సమస్య కాదు.. కానీ నాకు చెప్పింది ఏంటని అడిగాను.. నా గత సినిమా చూసి కావాలని ఇలాంటి సీన్లలో నన్ను ఇరికిస్తున్నారని అన్నాను. దీంతో అందరూ నాకు వ్యతిరేకంగా మారారు. నిర్మాతలు సైతం అలాంటి సీన్లు చేయాలని బలవంతం చేసారు. అదెంత అన్యాయం.. గొడవ పడితే పెట్టుబడి పోతుందని సినిమా పూర్తి చేశాను. కానీ స్క్రీనింగ్ కు కూడా నన్ను పిలవలేదు.. నేను సరిగ్గా నటించనని నా పేరు నాశనం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

Follow Us