AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: రాజ్యసభలో ట్రిపులార్‌పై ప్రశంసల జల్లు.. నాటు నాటు అనగానే దద్దరిల్లిన సభ.

విశ్వ వేదికపై తెలుగు సినిమాను నిలబెట్టిన ట్రిపులార్‌ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగు వారితో పాటు దేశ ప్రజలంతా సాహో రాజమౌళి అంటున్నారు. నాటు నాటు పాట పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కడం దేశ ప్రజల విజయంగా భావిస్తున్నారు...

RRR: రాజ్యసభలో ట్రిపులార్‌పై ప్రశంసల జల్లు.. నాటు నాటు అనగానే దద్దరిల్లిన సభ.
Rajya Sabha congratulates oscar winners
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 14, 2023 | 12:53 PM

విశ్వ వేదికపై తెలుగు సినిమాను నిలబెట్టిన ట్రిపులార్‌ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగు వారితో పాటు దేశ ప్రజలంతా సాహో రాజమౌళి అంటున్నారు. నాటు నాటు పాట పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కడం దేశ ప్రజల విజయంగా భావిస్తున్నారు. బెస్ట్‌ ఒరిజినల్ క్యాటగిరీలో ఆస్కార్‌ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్‌తో ఆస్కార్‌ వేదిక దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దేశ గర్వాన్ని విశ్వవేదికపై నిలబెట్టిన ట్రిపులార్‌ చిత్ర బృందానికి సినీ పరిశ్రమ మొదలు రాజకీయ నాయకుల వరకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా పార్లమెంట్ సమావేశాల్లోనూ ట్రిపులార్‌ చిత్రానికి గౌరవం దక్కింది. ఆస్కార్‌ వేదిక చరిత్ర సృష్టించిన మన తెలుగు సినిమా ట్రిపులార్‌ గురించి రాజ్యసభలోనూ ప్రశంసలు వెల్లువెత్తాయి. రాజ్యసభ చైర్మన్‌ జగ్దీప్ ధన్‌ఖర్ ట్రిపులార్‌ చిత్ర యూనిట్‌ను అభినందించారు.. ఆయన నాటు నాటు అంటూ మొదలు పెట్టగానే సభలో ఉన్న సభ్యుల చప్పట్లతో సభ ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్‌కు కూడా రాజ్యసభ చైర్మన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయాలు భారతీయ కళాకారుల అపారమైన ప్రతిభ, అపారమైన సృజనాత్మకత అంకితభావాని తెలియజేస్తాయన్నారు. నిజానికి ఇది మన గ్లోబల్‌ గుర్తింపు అంటూ ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆర్థిక బిల్లుకు ఎలాగైనా ఆమోదం పొందాలని అధికార బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అదాని వ్యవహారం,. రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం వంటివి ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు పక్కా ప్లాన్ చేశాయి.

మోదీగారు మీ ఖాతాలో మాత్రం వేసుకోకండి..

భారత దేశానికి రెండు ఆస్కార్‌ అవార్డులు దక్కడంపై రాజ్యసభలో కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ మల్లిఖార్జున్‌ ఖర్గే స్పందించారు. ట్రిపులార్‌తో పాటు, ది ఎలిఫెంట్ విస్పర్స్ చిత్రయూనిట్స్‌కి ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ సందర్భంలో ప్రధాని మోదీకి తనదైన శైలిలో చురకలు అంటించారు ఖర్గే. ఆస్కార్‌ విజయాలను మోదీ గారు తమ ఖాతాలో వేసుకోకండి అంటూ చమత్కరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..