‘పోలీస్ అంకుల్.. అమ్మే నాన్నను చంపేసింది’ ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చిన భార్య
ఓ భార్య పరాయి వ్యక్తి మోజులో పడి భర్తను కడతేర్చింది. కన్న కొడుకు కళ్లముందే గొంతుకోసి దారుణంగా హత్య చేసింది. ఐదేళ్ల కొడుకుకి ఏం తెలుస్తుందిలే అనుకుంది. కానీ ఆ పసివాడు పోలీసుల ఎదుట తల్లి చేసిన నిర్వాకాన్ని వచ్చీరాని మాటలతో పూసగుచ్చినట్లు చెప్పేశాడు. అంతే పోలీసులు ఆ కిరాతకురాలిని అరెస్టు చేసి జైలుకు పంపారు. పశ్చిమ బెంగాల్ మాల్దాలోని..

పశ్చిమ బెంగాల్, సెప్టెంబర్ 1: ఓ భార్య పరాయి వ్యక్తి మోజులో పడి భర్తను కడతేర్చింది. కన్న కొడుకు కళ్లముందే గొంతుకోసి దారుణంగా హత్య చేసింది. ఐదేళ్ల కొడుకుకి ఏం తెలుస్తుందిలే అనుకుంది. కానీ ఆ పసివాడు పోలీసుల ఎదుట తల్లి చేసిన నిర్వాకాన్ని వచ్చీరాని మాటలతో పూసగుచ్చినట్లు చెప్పేశాడు. అంతే పోలీసులు ఆ కిరాతకురాలిని అరెస్టు చేసి జైలుకు పంపారు. పశ్చిమ బెంగాల్ మాల్దాలోని పుఖురియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సంబల్‌పూర్ రాంచంద్రపూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్ధానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సంబల్‌పూర్ రాంచంద్రపూర్ ప్రాంతంలో నివసం ఉంటోన్న హసన్ అలీ (22)కు భార్య, ఐదేళ్ల కొడుకు ఉన్నారు. మంగళవారం భార్యాభర్తలు తమ ఐదేళ్ల కుమారుడు ఇంజమామ్‌తో ఇంట్లోనే ఉన్నారు. అదే రోజు దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన హసన్ భార్య అతని గొంతుకోసి హత్య చేసింది. కొడుకు భయంతో కేకలు వేయడంతో ఆమె పిల్లాడిని కొట్టి నోరు మూయించింది. హసన్ ఇంటి లోపల నుంచి కేకలు వినిపించడంతో ఇరుగుపొరుగు తలుపులు తెరిచి చూడగా హసన్ అలీ రక్తం మడుగులో శవమై కనిపించాడు. వెంటనే వారు పుఖురియా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు హసన్ కుమారుడు ఇంజమామ్ జరిగిందంతా వివరించాడు. దీంతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిచారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మాల్డా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించారు.
హసన్ చనిపోయాడని నాకు సమాచారం అందింది. త్వరగా ఇక్కడికి వచ్చాను. హసన్ భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధాలు ఉన్నాయి. అడ్డు తొలగించుకోవడానికి ఆమె హసన్ చంపేసింది. ఆమెను కఠినంగా శిక్షించాలంటూ మృతుడి తల్లి షెఫాలీ బీబీ డిమాండ్ చేసింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు కూడా తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం, హసన్ తన భార్యను ఇంటికి తీసుకురావడానికి గ్రామంలో సమావేశాన్ని పిలిచాడు. తన తల్లే తండ్రిని హత్య చేసిందని అమాయకపు కొడుకు స్వయంగా పోలీసులకు తెలిపాడు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




