సింగపూర్ అధ్యక్ష బరిలో భారత సంతతికి చెందిన మాజీ మంత్రి.. ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ
సింగపూర్ 9వ అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం (సెప్టెంబర్ 1) ఉదయం ప్రారంభమైంది. సింగపూర్ ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్ధుల్లో సింగపూర్‌లో జన్మించిన భారత సంతతికి చెందిన మాజీ మంత్రి ధర్మన్ షణ్ముగరత్నం కూడా ఉన్నారు. ఐతే తనకు దాదాపు 2.7 మిలియన్లకు పైగా..
సింగపూర్, సెప్టెంబర్ 1: సింగపూర్ 9వ అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం (సెప్టెంబర్ 1) ఉదయం ప్రారంభమైంది. సింగపూర్ ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్ధుల్లో సింగపూర్‌లో జన్మించిన భారత సంతతికి చెందిన మాజీ మంత్రి ధర్మన్ షణ్ముగరత్నం కూడా ఉన్నారు. ఐతే తనకు దాదాపు 2.7 మిలియన్లకు పైగా సింగపూర్ వాసులు ఓటు వేస్తారని ధర్మాన్ షణ్ముగరత్నం (66) ధీమ వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్ వాసులు శుక్రవారం ఉదయం 8 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలు ఈ రోజు రాత్రి 8 గంటల వరకూ తెరచి ఉంటాయి. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి కూడా ఓ రోజే ఉంటుంది. నేటి రాత్రి 8 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అర్ధరాత్రికి ఫలితాలు వెలువడనున్నట్లు ఎలక్షన్స్ డిపార్ట్‌మెంట్ సింగపూర్ (ELD) తెల్పింది.
సింగపూర్ తొమ్మిదవ అధ్యక్ష ఎన్నికల బరిలో ధర్మాన్ తోపాటు సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ కార్ప్ (GIC)లో మాజీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ అయిన ంగ్ కోక్ సాంగ్, NTUC ఇన్‌కమ్ మాజీ చీఫ్ టాన్ కిన్ లియాన్ బరిలో ఉన్నారు. సింగపూర్ ప్రస్తుత అధ్యక్షురాలు హలీమా యాకోబ్ ఆరేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 13తో ముగియనుంది. హలీమా యాకోబ్ సింగపూర్ దేశ 8వ, మొదటి మొదటి మహిళా అధ్యక్షురాలు. శుక్రవారం తెల్లవారుజామున పోలింగ్ కేంద్రానికి చేరుకుని ప్రెసిడెంట్ హలీమా, ప్రధాన మంత్రి లీ సియెన్ లూంగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ధర్మాన్ షణ్ముగరత్నం ఎవరంటే.. కాగా సింగపూర్లో అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల అర్హత నిబంధనలు కఠినంగా ఉంటాయి. సింగపూర్‌లో జన్మించిన భారత సంతతికి చెందిన ధర్మాన్ షణ్ముగరత్నం 2001లో రాజకీయాల్లోకి వచ్చారు. రెండు దశాబ్దాలకు పైగా అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) నుంచి వివిధ మంత్రి పదవుల్లో పనిచేశారు. 2011-2019 మధ్య సింగపూర్ ఉప ప్రధానమంత్రిగా థర్మాన్ పనిచేశారు. ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు గాపై ధర్మాన్ ఈ ఏడాది జూలైలో ప్రజా, రాజకీయ పదవులకు రాజీనామా చేశారు. సింగపూర్‌కు గతంలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నారు.
తమిళ సంతతికి చెందిన S R నాథన్ (సెల్లపన్ రామనాథన్) 2009లో సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేరళ సంతతికి చెందిన దేవన్ నాయర్ 1981 నుంచి 1985 వరకు సింగపూర్ మూడవ అధ్యక్షుడిగా పనిచేశారు. మలేషియాలోని మలక్కాలో 1923లో జన్మించిన నాయర్ కేరళలోని తలస్సేరికి చెందిన రబ్బరు తోటల గుమాస్తా కుమారుడు. సింగపూర్‌లో మొదటి అధ్యక్ష ఎన్నికలు ఆగస్టు 28, 1993న జరిగాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.