AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KIFF 2023: కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సల్మాన్ ఖాన్, గంగూలీతో కలిసి మమతా బెనర్జీ డ్యాన్స్

సల్మాన్ ఖాన్ కోల్‌కతాలోని సిటీ ఆఫ్ జాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023కి అతిథిగా హాజరయ్యారు. సల్మాన్ ఖాన్‌తో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వంటి పలువురు ప్రముఖులు కూడా KIFF 2023 లో పాల్గొన్నారు.

KIFF 2023: కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సల్మాన్ ఖాన్, గంగూలీతో కలిసి మమతా బెనర్జీ డ్యాన్స్
Mamatha , Salman Khan Dance
Balaraju Goud
|

Updated on: Dec 06, 2023 | 7:24 AM

Share

‘టైగర్ 3’ చిత్ర నటుడు సల్మాన్ ఖాన్‌కు ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు. ప్రస్తుతం, సల్మాన్ ఖాన్ కోల్‌కతాలోని సిటీ ఆఫ్ జాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023కి అతిథిగా హాజరయ్యారు. సల్మాన్ ఖాన్‌తో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వంటి పలువురు ప్రముఖులు కూడా KIFF 2023 లో పాల్గొన్నారు.

అయితే ఈ సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సినీ ప్రముఖులతో కలిసి డాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మమతా బెనర్జీ సల్మాన్ ఖాన్ సహా ఇతరులతో ఒకే వేదికపై చేరడం సినీ అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. సింగర్ అరిజిత్ సింగ్ పాడిన పాటకు మమతా బెనర్జీ కాలుకదిపి ఫిలిం ఫెస్టివల్‌లో జోష్ నింపారు.

బాలీవుడ్ మెగా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీతో పాటు, సపోర్ట్ వరల్డ్‌లో సల్మాన్ అభిమానుల సంఖ్య ఎప్పుడూ చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బీసీసీఐ మాజీ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ కూడా సల్మాన్ ఖాన్ అభిమానిగా మారిపోయానని చెప్పుకొచ్చారు.

29వ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా, సౌరవ్ గంగూలీకి సంబంధించిన తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సల్మాన్ గురించి సౌరవ్ మాట్లాడుతూ- అందరికీ ఇష్టమైన, నాకు ఇష్టమైన సల్మాన్ ఖాన్‌ను మొట్ట మొదటిసారిగా కలుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మేము ఇంతకు ముందెన్నడూ కలవకపోవడం దురదృష్టకరమని చెప్పారు.

కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో సల్మాన్ ఖాన్‌తో పాటు హిందీ సినిమాకి చెందిన పలువురు నటులు కూడా హాజరయ్యారు . ఇందులో అనిల్ కపూర్, సోనాక్షి సిన్హా, మహేష్ భట్, శతృఘ్న సిన్హా పేర్లు ఉన్నాయి. విశేషమేమిటంటే.. వీరంతా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సినీ తారలతో కలిసి వేదికపై డ్యాన్స్ చేశారు. సల్మాన్‌తో మమతా బెనర్జీ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, అది ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…