AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Recruitment Exams: డిసెంబర్‌ 17న నాలుగు నియామక పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాలకు నిర్వహించే నియామక పరీక్షలు ఒకే తేదీనే ఉండటంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం నాలుగు సంస్థల ఉద్యోగ నియామక పరీక్షలు ఒకే తేదీన వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు, 60 కెమిస్ట్‌ పోస్టులకు రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేసేందుకు జెన్‌కో ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న..

Recruitment Exams: డిసెంబర్‌ 17న నాలుగు నియామక పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు
Exam
Srilakshmi C
|

Updated on: Dec 06, 2023 | 9:40 PM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5: దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాలకు నిర్వహించే నియామక పరీక్షలు ఒకే తేదీనే ఉండటంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం నాలుగు సంస్థల ఉద్యోగ నియామక పరీక్షలు ఒకే తేదీన వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు, 60 కెమిస్ట్‌ పోస్టులకు రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేసేందుకు జెన్‌కో ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్‌ 17వ తేదీన రాత పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటనలో వెలువరించింది.

మరోవైపు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 10,391 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్‌ 16, 17, 23, 24 తేదీల్లో ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్‌ నిర్వహించనుంది. అలాగే ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో)లో 65 సైంటిస్ట్/ఇంజినీర్ (ఎస్‌సీ) పోస్టులకు డిసెంబర్ 17న నియామక పరీక్ష జరగనుంది. ఇక భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL)లో కూడా 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు డిసెంబర్‌ 17వ తేదీనే పరీక్ష నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి హాల్‌టికెట్లు/అడ్మిట్‌ కార్డులను కూడా ఆయా నియామక సంస్థలు అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచాయి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏ పరీక్ష రాయాలో, ఏ పరీక్షకు సన్నద్ధమవ్వాలో తెలియక గందరగోల పడుతున్నారు. పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆయా పోస్టుల పరీక్ష తేదీలు ఇవే

  • తెలంగాణ జెన్‌కోలో 399 అసిస్టెంట్ ఇంజినీర్/ కెమిస్ట్‌ పోస్టులకు నియామక పరీక్ష తేదీ: డిసెంబర్‌ 17
  • ఇస్రోలో 65 సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టులకు నియామక పరీక్ష తేదీ: డిసెంబర్‌ 17
  • బెల్‌లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నియామక పరీక్ష తేదీ: డిసెంబర్‌ 17
  • ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 10,391 బోధన, బోధనేతర ఖాళీల భర్తీకి నియామక పరీక్ష తేదీ: డిసెంబర్‌ 16, 17, 23, 24

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?