TS SET Results 2023: టీఎస్ సెట్ 2023 ఫలితాలు విడుదల.. ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్ సెట్)-2023 ఫలితాలు బుధవారం (డిసెంబర్ 6) విడుదలయ్యాయి. ఫలితాలో పాటు తుది కీ కూడా విడుదలైంది. సెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అధికారిక వెబ్‌సైట్ నుంచి స్కోరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీఎస్ సెట్ పరీక్షలో అర్హత సాధించవల్సి ఉంటుంది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు..
హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్ సెట్)-2023 ఫలితాలు బుధవారం (డిసెంబర్ 6) విడుదలయ్యాయి. ఫలితాలో పాటు తుది కీ కూడా విడుదలైంది. సెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అధికారిక వెబ్‌సైట్ నుంచి స్కోరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీఎస్ సెట్ పరీక్షలో అర్హత సాధించవల్సి ఉంటుంది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతాయి. మొత్తం రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. మొదటి పేపర్‌కు జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టుల్లో సీబీటీ విధానంలో పరీక్ష జరిగింది. పేపర్ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. ప్రతీయేట ఓయూ ఆధ్వర్యంలో సెట్ పరీక్ష జరుగుతోన్న సంగతి తెలిసిందే.
టీఎస్ సెట్ 2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి.
7,547 ఢిల్లీ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన నియామక పరీక్ష ప్రాథమిక కీ విడుదల
ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) నియామక పరీక్ష ప్రాథమిక కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా డిసెంబర్ 9వ తేదీలోగా స్వీకరించనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నవంబర్ 14 నుంచి డిసెంబర్ 3 వరకు పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7547 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.