AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించింది. కానీ చివరకి ప్రియుడి కోసమే..

గజియాబాద్ జిల్లాలోని కపిల్ చౌదరి(45) తన భార్య శివాని చౌదరి(28) తో కలిసి ఉంటూ ఓ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నాడు. అయితే రెండు వారాల క్రితం కపిల్ చౌదరి మృతిచెందాడు.

భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించింది. కానీ చివరకి ప్రియుడి కోసమే..
Accused
Aravind B
|

Updated on: Mar 20, 2023 | 2:21 PM

Share

ప్రియుడితో కలిసి ఉండాలనే కోరికతో భర్త అడ్డు తొలగించుకనేందుకు.. ప్రియుడితో కలిసి భార్య హత్య చేసే ఘటనలు ఇటీవల జరుగుతూనే ఉన్నాయి. ఇప్పడు తాజాగా అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. గజియాబాద్ జిల్లాలోని కపిల్ చౌదరి(45) తన భార్య శివాని చౌదరి(28) తో కలిసి ఉంటూ ఓ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నాడు. అయితే రెండు వారాల క్రితం కపిల్ చౌదరి మృతిచెందాడు. అయితే ఆయన భార్య శివాని తన భర్త గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులను నమ్మించింది. వాళ్లింటికి వచ్చిన పోలీసుల కపిల్ శర్మ తలపై గాయమై, అతని పక్కన తుపాకిని ఉండటాన్ని గుర్తించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే శవ పరీక్ష రిపోర్టులు వచ్చిన తర్వాత కీలక విషయాలు బయట పడ్డాయి. గన్ షాట్ అనేది కపిల్ తలకు ఎడమవైపు ఉంది.. నిజానికి కపిల్ రైట్ హాండ్ హ్యండ్ ను వినియోగించే వ్యక్తి కావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీనిపై అతని భార్య శివానిని అడగగా తన భర్తకు లోన్లు ఎక్కువైపోవడంతోనే మానసిక ఒత్తిడికి గురై తనకు తానే కాల్చుకున్నాడని చెప్పింది.కానీ పోలీసులకు ఆమె చెప్పే విషయాలను నమ్మబుద్ది కాలేదు. దీనిపై విచారణ ప్రారంభించారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

శివాని ఇంటి దగ్గర ఓ మొబైల్ షాప్ ను అంకుష్ అనే వ్యక్తి నడిపేవాడు. శివాని తరచూ అక్కడికి వెళ్లి ఫోన్ రిచార్జి చేసుకునేది. 2022 నవంబర్ లో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త రిలేషన్ కి దారితీసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై శివానిని..ఆమె ప్రియుడు అంకుశ్ ని అడగగా చివరికి నిజం బయటపెట్టారు. తన భర్త ఆమెపట్ల సరిగ్గా వ్యవహరించేవాడు కాదని అందుకే తాను అంకుష్ కి దగ్గరైనట్లు తెలిపింది. కపిల్ అక్రమంగా ఓ తుపాకిని కూడా ఇంటికి తీసుకొచ్చాడని.. దాన్ని ఎలా వాడాలో తనకు నేర్పించాడని శివాని పోలీసులకు వివరించింది. కపిల్ ను హత్య చేసే ముందు అంకుష్ ను తన ఇంటికి పిలిపించి ఆ ఆయుధాన్ని ఎలా వాడాలో నేర్పించింది. తన భర్తను హత్య చేయాలనుకున్న రోజున కపిల్ కు నిద్ర మాత్రలు ఇచ్చింది. అతను నిద్రలోకి జారుకోగానే అంకుష్ అతని తలకు ఎడమవైపు తుపాకితో కాల్చేశాడు. ఈ హత్య జరిగిన అనంతరం వారిద్దరూ తమ సిమ్ కార్డులను పారేసినట్లు శివాని పోలీసులకు తెలిపింది. వీళ్లిద్దరిపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయవార్తల కోసం

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..