AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Man Sold Wife Kidney: భార్య కిడ్నీని ఆమెకు తెలియకుండానే అమ్మేసి .. ఆ డబ్బుతో మరో పెళ్లి చేసుకున్న భర్త

తన భర్త కిడ్నీ దొంగలించిన విషయం నాలుగేళ్ల తర్వాత ఆ భార్యకు తెలిసింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది ఆ భార్య.. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు. నిందితుడు ప్రశాంత్ కుందు కోటమెట గ్రామానికి చెందినవాడు

Man Sold Wife Kidney: భార్య కిడ్నీని ఆమెకు తెలియకుండానే అమ్మేసి .. ఆ డబ్బుతో మరో పెళ్లి చేసుకున్న భర్త
Man Sells Wife Kidney
Surya Kala
|

Updated on: Sep 13, 2022 | 3:23 PM

Share

Man Sold Wife Kidney: పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకున్న దంపతుల జీవితం సాఫీగా సాగుతోంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కాలక్రమంలో భర్త వ్యసనాలకు బానిస అయ్యాడు. ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో భార్యకు తెలియకుండా ఆమె కిడ్నీ అమ్మేశాడు. వచ్చిన ఆ డబ్బుతో మరో పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. తన భర్త కిడ్నీ దొంగలించిన విషయం నాలుగేళ్ల తర్వాత ఆ భార్యకు తెలిసింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది ఆ భార్య.. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు. నిందితుడు ప్రశాంత్ కుందు కోటమెట గ్రామానికి చెందినవాడు. ఈ సంచలన ఘటన ఒడిషాలో వెలుగుచూసింది.

కొటమెట గ్రామంలో ప్రశాంత్ కందూ.. బంగ్లాదేశ్ నుంచి వచ్చి శరణార్థిగా నివసిస్తున్నాడు. రంజిత అనే మహిళతో 12 ఏళ్ల క్రితం ప్రశాంత్ కందూకు పెళ్లైంది. అయితే 2018లో కడుపునొప్పి రావడంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయని.. వాటిని తీయించాలంటూ.. భార్య రంజితను నమ్మించాడు. ఆమెను భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. భర్త, డాక్టర్‌తో కుమ్మక్కై ఒక కిడ్నీ తీసి, బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మేశారు. అయితే ఇటీవల పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో రంజిత హాస్పిటల్ కు వెళ్లింది. అప్పుడే కిడ్నీ ఒకటి లేదన్న విషయం బయటపడింది. ఆ సమయంలో అదే ఆసుపత్రిలో చేరిన MV-38కి చెందిన అసిమ్ హల్దార్‌కు తన కిడ్నీ మార్పిడి చేశారని ఆమె ఆరోపించింది. దీంతో ఆగస్ట్ 24న మల్కన్ గిరి పోలీస్ స్టేషన్ లో తన భర్తపై కంప్లెయింట్ చేసింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిడ్ని అమ్మగా వచ్చిన డబ్బులతో ఆంధ్రప్రదేశ్ కి వెళ్లి మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు. ఆ తర్వాత బెంగుళూరు వెళ్లిపోయాడని రంజిత తన ఫిర్యాదులో పేర్కొంది. ఎట్టకేలకు పోలీసులు ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..