UCO Bank Recruitment 2022: బ్యాంక్ జాబ్స్! యూసీఓ బ్యాంక్‌లో సెక్యురిటీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన యూసీఓ బ్యాంక్ (UCO Bank).. 10 సెక్యురిటీ ఆఫీసర్ పోస్టుల (Security Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
UCO Bank Security Officer Recruitment 2022: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన యూసీఓ బ్యాంక్ (UCO Bank).. 10 సెక్యురిటీ ఆఫీసర్ పోస్టుల (Security Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇండియన్ నేవీ/ఎయిర్ ఫోర్స్ లేదా పారామిలిటరీ ఫోర్సుల్లో (BSF/CRPF/ITBP/CISF/SSB etc.) అసిస్టెంట్ కమాండెంట్స్ లేదా డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్‌గా కనీసం 5 యేళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి. లేదా పారామిలిటరీ ఫోర్సుల్లో (BSF/CRPF/ITBP/CISF/SSB etc.) ఇన్స్‌పెక్టర్, సబ్-ఇన్స్‌పెక్టర్‌గా కనీసం 8 యేళ్లు పనిచేసి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు జనవరి 1, 2022వ తేదీలోపు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 19, 2022 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.100, జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.