Uttarakhand: నైనిటాల్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..

ప్రమాదం జరిగిన బస్సులో 32 మంది ప్రయాణిస్తున్నట్లు.. హర్యానాలోని హిసార్ నుండి నైనిటాల్ సందర్శించడానికి వచ్చినట్లు సమాచారం. ఆదివారం రాత్రి ఈ బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 6 మంది ప్రయాణికులు మృతి చెందారు. మిగిలిన ప్రయాణికులను అర్థరాత్రి వరకు కాపాడడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Uttarakhand: నైనిటాల్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
Accident Site In Nainital
Follow us
Surya Kala

|

Updated on: Oct 09, 2023 | 9:05 AM

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదం నైనిటాల్‌లోని కలదుంగి రోడ్డులోని నల్ని సమీపంలో జరిగింది. బస్సులో 32 మంది ఉన్నారు. నైనిటాల్ సందర్శించడానికి హిసార్ నుండి వచ్చిన పర్యాటకులు బస్సులో ఉన్నారు. బస్సు కాలువలో పడిన సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు.

గాయపడిన ప్రయాణికులను ఘటనా స్థలం నుంచి రక్షించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికుల కోసం SDRF, NDRF బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఏ కారణాల వల్ల బస్సు కాలువలో పడిపోయింది? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ప్రమాదం జరిగిన బస్సులో 32 మంది ప్రయాణిస్తున్నట్లు.. హర్యానాలోని హిసార్ నుండి నైనిటాల్ సందర్శించడానికి వచ్చినట్లు సమాచారం. ఆదివారం రాత్రి ఈ బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. మిగిలిన ప్రయాణికులను అర్థరాత్రి వరకు కాపాడడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

బస్సు కాలువలో పడిన ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సూచించారు. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

పితోర్‌గఢ్‌లో బొలెరోపై పడిన రాయి

మరోవైపు ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. పితోర్‌గఢ్‌లోని ధార్చుల-గుంజి రహదారిపై బొలెరోపై పర్వత రాయి పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 9 మంది మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఎస్‌ఎస్‌బి, ఆర్మీ, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి కూడా విచారం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..