Migrating Birds: చికాగో వీధుల్లో దారుణం.. తివాచీలా పరిచిన పక్షుల ‘కళేబరాలు’.. చూపరుల కంట కన్నీరు
ఆశ్చర్యమైన సంఘటనగా నిలిచింది. ఎందుకంటే సాయంత్రం వరకు ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగలేదు. స్థానికులు కొన్ని పక్షులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. తద్వారా వాటిని రక్షించగలిగారు. అప్పటికే కొన్ని చనిపోగా.. ఆసుపత్రికి తీసుకుని వెళ్లే సమయంలో మరికొన్ని చనిపోయాయి. శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ఇది చాలా విచిత్రమైన ఘటనగా అభివర్ణించారు. ఇంగ్లిష్ వెబ్‌సైట్ న్యూయార్క్ పోస్ట్‌లో ప్రచురితమైన వార్త ప్రకారం.. గురువారం ఈ ఘోర మారణకాండ జరిగింది.
చాలా సార్లు మన కళ్ల ముందే ఏదో జరుగుతుంది.. అది ఎలా జరిగిందో.. ఏమి జరిగిందో.. ఎందుకు జరిగిందో అర్థం చేసుకోలేము. ఇలాంటి సంఘటనల గురించి ప్రజలు చర్చించుకుంటూనే ఉంటారు కానీ ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అమెరికాలోని ప్రముఖ పట్టణం చికాగోలో వెలుగు చూసిన ఓ ఉదంతం కూడా ఇలాంటిదే.. తెల్లవారుజామున నిద్రలేచి వీధుల్లోకి చూసే సరికి వందలాది పక్షులు రోడ్లపై పడి ఉండడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇది చూసిన జనాలకు ఏం జరిగిందో అర్థం కాలేదు.
ఇది ఆశ్చర్యమైన సంఘటనగా నిలిచింది. ఎందుకంటే సాయంత్రం వరకు ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగలేదు. స్థానికులు కొన్ని పక్షులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. తద్వారా వాటిని రక్షించగలిగారు. అప్పటికే కొన్ని చనిపోగా.. ఆసుపత్రికి తీసుకుని వెళ్లే సమయంలో మరికొన్ని చనిపోయాయి. శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ఇది చాలా విచిత్రమైన ఘటనగా అభివర్ణించారు. ఇంగ్లిష్ వెబ్‌సైట్ న్యూయార్క్ పోస్ట్‌లో ప్రచురితమైన వార్త ప్రకారం.. గురువారం ఈ ఘోర మారణకాండ జరిగింది. NYT తన పోస్ట్‌లో అది చనిపోయిన పక్షుల కార్పెట్ లా ఉందని కూడా రాసింది. కన్వెన్షన్ సెంటర్‌లోని ఎత్తైన భవనాన్ని ఢీకొట్టడంతో పక్షులన్నీ గాయపడి చనిపోయాయని అనిపించింది.
ఇలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలియదు?
ఈ విషయంపై అమెరికన్ బర్డ్ కన్సర్వెన్సీకి చెందిన బ్రియాన్ లెంజ్ గాజు కిటికీలను ఢీకొని ప్రతి సంవత్సరం ఒక బిలియన్ పక్షులు చనిపోతున్నాయని.. గాజులో వాటి ప్రతిబింబాన్ని చూడలేక అవన్నీ అక్కడే ఢీకొని పడిపోయాయని పేర్కొన్నాడు. అయితే చాలా మంది తన వాదనను నమ్మలేదని అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియోలో ప్రొఫెసర్ బ్రెండన్ శామ్యూల్స్ మాట్లాడుతూ కిటికీకి తగిలిన ప్రతి పక్షి చనిపోదని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న పక్షులలో ఎక్కువగా టేనస్సీ వార్బ్లెర్స్, హెర్మిట్ థ్రష్‌లు, అమెరికన్ వుడ్‌కాక్స్ లతో పాటు అనేక ఇతర రకాల పక్షులు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి మరణాలు చాలా వరకు శరదృతువు , వర్షాకాలంలో సంభవిస్తున్నాయని చెప్పారు. గాలి, వాన, పొగమంచు వంటి వివిధ పరిస్థితుల వల్ల అనేక పక్షుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషాద ఘటనలో నిజానిజాలు ఇంత వరకూ ఎవరూ కనుగొనలేకపోయారని వెల్లడించారు.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..