Chandrayaan-3: చంద్రయాన్-3 కథ ముగిసిందా..? ఇస్రో ఏం చెప్తుంది.? వీడియో..
చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. జాబిల్లిపై ఇంకా స్లీప్ మోడ్‌లోనే ఉన్నాయి. జాబిల్లిపై రాత్రి పూర్తయి పగలు వచ్చి మళ్లీ రాత్రి వచ్చినా ల్యాండర్, రోవర్‌లలో మాత్రం ఇప్పటికీ చలనం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే విక్రమ్, ప్రజ్ఞాన్‌లను నిద్ర లేపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే అవేమీ ఫలించకపోవడంతో చంద్రయాన్ 3 పని అయిపోయిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. జాబిల్లిపై ఇంకా స్లీప్ మోడ్‌లోనే ఉన్నాయి. జాబిల్లిపై రాత్రి పూర్తయి పగలు వచ్చి మళ్లీ రాత్రి వచ్చినా ల్యాండర్, రోవర్‌లలో మాత్రం ఇప్పటికీ చలనం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే విక్రమ్, ప్రజ్ఞాన్‌లను నిద్ర లేపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే అవేమీ ఫలించకపోవడంతో చంద్రయాన్ 3 పని అయిపోయిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ల్యాండర్, రోవర్‌లతో కనెక్షన్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు అలుపెరగకుండా చేస్తున్న పరిశోధనలు, ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ల్యాండర్, రోవర్‌లను యాక్టివేట్ చేసేందుకు ఇస్రో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న విక్రమ్ ల్యాండర్ 3 డీ చిత్రాన్ని తీసింది. అనాగ్లిఫ్ టెక్నిక్‌ను ఉపయోగించి ఈ 3 డీ చిత్రాన్ని ఇస్రో రూపొందించింది. ఇక కౌరౌలోని యూరోపియన్ స్పేస్ స్టేషన్, బెంగళూరులోని ఇస్రో కేంద్రం కలిసి ప్రయత్నించినా ల్యాండర్, రోవర్‌ల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.
ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ 3 కోసం ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్.. జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలు మోపింది. అయితే చంద్రుడిపై రాత్రి కావస్తుండగా.. అక్కడ రాత్రి పూట ఉండే మైనస్ 200 నుంచి మైనస్ 250 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకోలేదని గుర్తించిన ఇస్రో… సెప్టెంబర్ 2వ తేదీన ప్రజ్ఞాన్ రోవర్‌ను సెప్టెంబర్ 4 వ తేదీన విక్రమ్ ల్యాండర్‌ను స్లీప్ మోడ్‌లోకి పంపించింది. అయితే మళ్లీ సెప్టెంబర్ 22 వ తేదీన జాబిల్లిపై సూర్యోదయం కాగా ల్యాండర్, రోవర్‌లు నిద్ర లేవడం లేదు. అప్పటినుంచి ఇస్రో రకరకాల ప్రయత్నాలు చేసినా అవి స్పందించడం లేదు. అయితే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ల జీవిత కాలం 14 రోజులేనని ఇస్రో ముందే ప్రకటించింది. అంటే చంద్రుడిపై పగలు ఉన్నన్ని రోజులు మాత్రమే పనిచేసేలా వాటిని రూపొందించారు. అయితే 14 రోజుల తరువాత అవి లేస్తే.. చంద్రయాన్ 3 సాధించిన మరో అద్భుతం అని ఇది వరకే ఇస్రో ప్రకటించింది. అవి యాక్టివేట్ అయి పనిచేస్తే అదనపు సమాచారం సేకరించవచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రుడిపై మళ్ళీ రాత్రి సమయం వచ్చేసింది. దీంతో ఇక విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ యాక్టివేట్ అవుతాయనే ఆశలు రోజు రోజుకూ సన్నగిల్లిపోతున్నాయి. అయినప్పటికీ ఇంకా ఆశలు వదులుకోలేదని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..