Grandmother Viral: విమానం నుంచి దూకేసిన 104 ఏళ్ల బామ్మ.. ఎందుకంటే..?
వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని ఆ బామ్మ చాటిచెప్పింది. వయసు శరీరానికే కాని మనోధైర్యం, సంక్పలం ముందు అది చిన్నబోతుందని తేల్చేసింది. చికాగోకు చెందిన 104 ఏళ్ల డరోతీ హాఫ్నర్ అనే బామ్మ విమానం నుంచి దూకి స్కైడైవ్ చేసిన అత్యంత వృద్ధ మహిళగా రికార్డు సాధించింది. ఈ ఘటనకు సంబంధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ పరిశీలన ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.
వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని ఆ బామ్మ చాటిచెప్పింది. వయసు శరీరానికే కాని మనోధైర్యం, సంక్పలం ముందు అది చిన్నబోతుందని తేల్చేసింది. చికాగోకు చెందిన 104 ఏళ్ల డరోతీ హాఫ్నర్ అనే బామ్మ విమానం నుంచి దూకి స్కైడైవ్ చేసిన అత్యంత వృద్ధ మహిళగా రికార్డు సాధించింది. ఈ ఘటనకు సంబంధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ పరిశీలన ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. బామ్మ స్కైడైవింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ క్లిప్‌లో స్కైడైవ్ చేసేందుకు బామ్మ వాకర్‌తో నడిచి వచ్చింది. అక్కడ తన వాకర్‌ను పక్కన పెట్టి, విమానంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంతో కాన్ఫిడెంట్‌గా నవ్వుతూ విమానంలో కూర్చుంది. విమానం గాల్లోకి ఎగిరింది. అంతే ఒక్కసారిగా బామ్మ విమానంనుంచి దూకి నవ్వుతూ స్కైడైవింగ్ చేసింది. బామ్మ ముఖంలో చిరునవ్వు మాత్రం చెరగలేదు. బామ్మ ఆత్మవిశ్వాసం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. స్కైడైవింగ్ అనుభవం చాలా సరదాగా సాగిందని, ప్యారాచూట్‌తో కిందకు దిగడం కూల్‌గా, అద్భుతంగా అనిపించిందని చెప్పుకొచ్చారు. స్కైడైవింగ్ రికార్డును హాఫ్నర్ తిరగరాసిన వీడియోను స్కైడైవ్ చికాగో.. నెట్టింట అప్‌లోడ్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక వయసున్న స్కైడైవర్ అయ్యేందుకు హాఫ్నర్‌కు సహకరించడం మరపురాని విషయమని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

