Viral Video: ఈ బామ్మతో పెట్టుకోకండి.. 70 ఏళ్లలోనూ ఎక్సర్ సైజులతో సవాల్..
ఏడుపదులు వయసులో ఉన్న వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారు? కృష్ణా… రామా.. అనుకుంటూ కూర్చుంటారు. కానీ ఈ బామ్మ కుస్తీపోటీలకు రెడీ అవుతున్నట్లు కసరత్తులు చేస్తోంది. ఏడుపదుల వయసులో కూడా 20 ఏళ్ల యువతకు ఏమాత్రం గా తీసిపోని విధంగా కసరత్తులు చేస్తున్న ఈ బామ్మ పట్టుదల వెనుక కథేంటో చూద్దాం. నాగలక్ష్మమ్మది శ్రీసత్యసాయి జిల్లా ఏనుములపల్లి. రోజూ వీధుల్లో తిరుగుతూ పల్లీలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది.
ఏడుపదులు వయసులో ఉన్న వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారు? కృష్ణా… రామా.. అనుకుంటూ కూర్చుంటారు. కానీ ఈ బామ్మ కుస్తీపోటీలకు రెడీ అవుతున్నట్లు కసరత్తులు చేస్తోంది. ఏడుపదుల వయసులో కూడా 20 ఏళ్ల యువతకు ఏమాత్రం గా తీసిపోని విధంగా కసరత్తులు చేస్తున్న ఈ బామ్మ పట్టుదల వెనుక కథేంటో చూద్దాం. నాగలక్ష్మమ్మది శ్రీసత్యసాయి జిల్లా ఏనుములపల్లి. రోజూ వీధుల్లో తిరుగుతూ పల్లీలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. వయోభారంతో వీధి వీధి తిరగాలంటే కాళ్లు నొప్పులు వస్తున్నాయని, అది మానేసి, టిఫిన్ సెంటర్‌లో పనికి చేరింది. ఉదయం టిఫిన్ సెంటర్లో పనిచేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతోంది. రాను రాను ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆలోచనలో పడింది బామ్మ. ఎలాగైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకున్న ఆ బామ్మ.. ఓపిక తెచ్చుకొని వ్యాయామం చేయడం మొదలుపెట్టింది. మెల్లగా స్థానికంగా ఉన్న శిల్పారామంలోని ఓపెన్ జిమ్‌కి వెళ్లి రోజూ ఓ గంట పాటు కసరత్తులు చేయడం అలవాటు చేసుకుంది. మెల్లగా నాగలక్ష్మమ్మ ఆరోగ్యం కుదుటపడటం గమనించింది. అంతే ఇంక వెనుదిరిగి చూడలేదు బామ్మ. రోజూ జిమ్‌కి వెళ్లి ఎక్సర్‌సైజులు చేస్తూ యువతకు సవాల్ విసురుతోంది. అందరూ కసరత్తులు చేయండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ సూచిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..