Krishna Mukunda Murari Episode October 9th, 2023: నువ్వు నాకు కావాలని సిగ్గు విడిచి చెప్పిన ముకుంద.. నువ్వు నాకు పరాయిదానివే.. కానిదానివి అన్న మురారీ..

అప్పుడు మురారీ అవును ముకుంద నిజంగా నువ్వు నాకు కానిదానివే..  కానీ మా కుటుంబానికి కావాల్సిన దానివి అది మాత్రం గుర్తు పెట్టుకో.. అంటూనే.. భార్య భర్తల మధ్యకు రావడం ఎంత వరకూ కరెక్ట్ ఆలోచించావా.. అని అడుగుతుంటే.. ఆ మాట అనకు మురారీ నేను భరించలేను.. నేను తప్ప కృష్ణే కాదు ఆ ప్లేస్ లో ఎవరు వచ్చినా నేను ఒప్పుకోలేను అని మురారీతో ముకుంద చెబుతుంది.

Krishna Mukunda Murari Episode October 9th, 2023: నువ్వు నాకు కావాలని సిగ్గు విడిచి చెప్పిన ముకుంద.. నువ్వు నాకు పరాయిదానివే.. కానిదానివి అన్న మురారీ..
Krishna Mukunda MurariImage Credit source: Hotstar
Follow us
Surya Kala

|

Updated on: Oct 09, 2023 | 8:10 AM

కృష్ణను ఏమి చెప్పి కన్విన్స్ చేయాలి అనుకుంటాడు కృష్ణ.. చూశారా నన్ను చూసి మీరు కూడా టెన్షన్ పడుతున్నారు. నాకు ఎంత టెన్షన్ ఉంటుందో చెప్పండి అని అంటుంటే.. అమ్మని రమ్మనమని పిలిచి కృష్ణకు సర్ది చెప్పమని చెప్పాలి అనుకుంటుంటే.. కొంచెం వాటర్ ఇవ్వమని అడుగుతుంది. ఇందాక నేను కారిడార్ లో ముకుంద ఉంది. నా వైపు చూస్తుంటే అసలు పట్టించుకోలేదు.. పువ్వులు కొస్తుంటే ఒక పువ్వు కింద పడింది.. ఆ పువ్వుని తీద్దామని వంగాను.. అక్కడ నీళ్లతొట్టిలో చవితి చంద్రుడు కనిపించాడు సార్.. చంద్రుడిని చూస్తే నీలాపనిందలు పడతాయాని అంటారు కదా అంటూ ఫీల్ అవుతుంది. కృష్ణ నిన్ను ఇప్పటి నుంచి తింగరి కృష్ణ అని కాదు మెంటల్ కృష్ణ అని పిలవాలి.. ఈ రోజుల్లో చవితి చంద్రుడు వేరు అప్పట్లో వేరా అంటూ..

మురారీ ముందే మాటకు మాట అనుకున్న కృష్ణ.. ముకుంద

గదిలో మురారీ.. కృష్ణలు ప్రేమగా ఉండడం.. ఇద్దరూ వాదించుకోవడం ముకుంద చూస్తుంది. ఆక్రోశంతో మురారీ అని అరుస్తుంది. నీ కోసం అందరూ వేట్ చేస్తున్నారు.. అని అంటుంది. వస్తాము నువ్వు అని అంటూనే కృష్ణ.. తలుపు కొట్టి రావడం సభ్యత సంస్కారం.. అని అంటే.. నాకు నేర్చిపించేటంత సీన్ నీకు లేదు అని అంటుంది ముకుంద. మొగుడు పెళ్ళాం గదిలో ఉన్నప్పుడు తలుపు కొట్టి రావడం నీకు నేర్పించాలి. నీవు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అని కృష్ణ మాటకు మాట అంటుంది. అయినా అందరూ కింద ఉంటే పైన మీరు ఏమి చేస్తున్నారు అని ముకుంద అడుగుతుంది. మేము ఇప్పుడు రాము నీకేమైనా ప్రోబ్లేమా వెళ్లి నీ పనిచేసుకో పో.. మా పనుల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోను వేళ్ళు అని అంటుంది కృష్ణ. అంటే మురారీ ఇప్పుడు ముకుంద ఎంత రచ్చ చేస్తుందో అనుకుంటూ వెళ్ళండి మీరు నేను వస్తా అని అంటుంది .. ఈ ముకుందకు ఏ స్పీడ్ లో బుద్ధి చెబితే బాగుంటుంది. అని అనుకుంటూనే నా స్టైల్ లోనే చెబుతా అని నిర్ణయం తీసుకుంటుంది.

ఈ జంటని విడదీసి పాపం చేస్తున్నామా..

కృష్ణ మొన్న పదిరోజుల క్రితం షాపింగ్ కి వెళ్ళాం.. ఇవ్వాళా వినాయక చవితి పండగ.. మామ భాషలో చెప్పాలంటే ధూమ్ ధామ్ చెయ్యడానికి వెళ్తున్నాం.. అవునా అంటే.. అవును అసలు విషయం చెప్పకుండా ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు బావగారు అని అలేఖ్య అడుగుతుంది.. చూడు కృష్ణ అని అలేఖ్య నవ్వుతుంది. చీర మార్చుకుని రమ్మనమని పంపిస్తాడు. అలేఖ్య .. ముకుంద కృష్ణలను చూసి నేను తప్పు చేస్తున్నానా ఇంత బాగున్నారు వీళ్లు విడగొట్టడానికి సాయం చేసి పాపం మూటగట్టుకుంటున్నానా అని అలేఖ్య ఆలోచిస్తూనే మళ్ళీ .. ఈ పాపం అంతా ముకుందది అని అనుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఏసీపీ సార్ కి నచ్చిందే చేస్తుంది

కృష్ణ చీర మార్చుకుని వస్తుంది. ఊరామసులా దసరాకు తయారవుతాయి ఓకేనా.. అంటుంది. ఇంతలో రేవతి వచ్చి ఏమి చీర ఇది.. పండగకు కట్టుకునే చీరేనా ఇది.. అంటూ వెళ్లి మార్చుకుని రా అంటే.. కుదరదు అత్తయ్య.. అని అంటూనే మా ఏసీపీ సార్ కు నచ్చిందే చేస్తుంది కృష్ణ. అలియాస్ తింగరి పిల్ల అంటుంది. ఇలా మీరిద్దరూ ఉంటే మిమ్మల్ని ఎవడురా విడగొట్టేది అని రేవతి కొడుకు చెవిలో గుసగుసలాడుతుంది. కృష్ణ ఇలా ఏమిటి గుసగుసలు అంటే.. నీకు ఏసీపీ అవ్వడానికంటే ముందు నా కొడుకు అని రేవతి చెబుతుంది. నేను ఈ ఇంటి కోడల్ని అంటుంటే.. తప్పకుండా వెళ్లాల్సిన పెళ్లి ఉంది నేను వెళ్లాలని పిన్ని బాబాయ్ కు చెప్పు అని వెళ్ళిపోతుంది.

సందడి చెయ్యడానికి రెడీ అవుతున్న ఫ్యామిలీ

ప్రభాకర్ హోటల్ లో ముకుంద మురారీ తో అన్నమాటలను.. తన ప్రవర్తనని తలచుకుంటూ ఆలోచిస్తాడు. ఇంతలో సుక్కు తో మాట్లాడుతుంటే.. మధు వచ్చి మావా అంటూ వస్తాడు. మీ ఊరులో వచ్చినట్లే ఇక్కడ కూడా వినాయక చవితి చేద్దాం అని మధు అంటారు. అందరినీ తీసుకుని రమ్మనమని చెబుతాడు. ముకుంద నాకోసం ఎవరైనా వస్తారో రారో చూద్దాం .. పిలవకపోతే ఇక్కడే గడిపేద్దాం అని అనుకుంటుంది.

ఆ బిడ్డ తేడాగొడుతుంది

కృష్ణ మురారీ వస్తుంటే.. మురారీని ముకుంద ఎక్కడ ఉందో తీసుకుని రా అని అంటుంది సుక్కు.. ఇంతగా చెబుతున్నా ఏసీపీ సార్ మనసులో ముకుంద లేదు అని సంతోషపడుతూ నేను వెళ్లి తీసుకుని వస్తా అని కృష్ణ వెళ్లబోతుంటే.. ఆపేస్తుంది సుక్కు.. మురారీని వెళ్లి ముకుందని తీసుకుని రమ్మనమని చెబుతుంది.

కృష్ణను ఇంటి నుంచి వెళ్లగొట్టేలా చెయ్యాలి

రోజు రోజుకీ కృష్ణ స్పీడ్ పెరుగుతుంది.. ఏదోలా అత్తయ్యకు మా ప్రేమ విషయం తెలిసేలా చెయ్యాలి.. కృష్ణ స్పీడ్ కు కళ్లెం వెయ్యాలి ఏదోలా కృష్ణను ఇంటి నుంచి బయటకు పంపించాలి.. ఇంత వరకు నా కోసం ఎవరూ రాలేదంటే.. నాకు ఉన్న విలువ ఏమిటో తెలుస్తుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే నేను మురారీని దక్కించుకోవాలి.

సిగ్గు విడిచి చెబుతున్నా

ముకుంద ఆలోచిస్తూ ఉంటే మురారీ.. ముకుంద దగ్గరకు వస్తుంటే.. రేర్ పీస్ ఇన్ని క్వాలిటీస్ ఉన్న నిన్ను నేను ఎలా వదులుకుంటా అనుకున్నావు.. అని ఆలోచిస్తుంటే..  అందరూ కింద ఉన్నారు వెళదాం పద అని మురారీ అంటుంటే.. వాళ్ళు అందరు నాకు ఎందుకు.. నాకు నువ్వు కావాలి.. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటు నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నానో తెలుసా.. సిగ్గు విడిచి చెబుతున్నా.. నీ కోసం.. నీ హృదయంలో నా స్తానం కోసం మురారి.. కృష్ణ నీ ముందే నన్ను అన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకున్నావు. నీ కోసం నీ ప్రేమ కోసం నిన్ను దేవుడిలా కొలుస్తున్న నన్ను తిడుతుంటే ఒక్క మాట అన్నవా మురారీ.. నీకు నేను అంత కానీ దానిని అయిపోయినా అని అడుగుతుంది.

నువ్వు నాకు కానిదానివే..

అప్పుడు మురారీ అవును ముకుంద నిజంగా నువ్వు నాకు కానిదానివే..  కానీ మా కుటుంబానికి కావాల్సిన దానివి అది మాత్రం గుర్తు పెట్టుకో.. అంటూనే.. భార్య భర్తల మధ్యకు రావడం ఎంత వరకూ కరెక్ట్ ఆలోచించావా.. అని అడుగుతుంటే.. ఆ మాట అనకు మురారీ నేను భరించలేను.. నేను తప్ప కృష్ణే కాదు ఆ ప్లేస్ లో ఎవరు వచ్చినా నేను ఒప్పుకోలేను అని మురారీతో ముకుంద చెబుతుంది. నీ స్థానం భార్యగా ఆదర్శ్ గుండెల్లో అని అంటే.. స్టాపిట్ మురారీ.. నేను ప్రేమ గురించి మాట్లాడుతుంటే నువ్వు ట్రాష్ గురించి మాట్లాడతావేమిటి అంటూ ముకుంద అరుస్తుంది.

భార్యగా నీ స్థానం ఆదర్శ్ గుండెల్లో

తప్పు ముకుంద .. ఆదర్శ్ గురించి మాట్లాడుతుంటే చెత్త మాటలు అంటావేమిటి..? అని అంటే కరెక్ట్ .. నథింగ్ బట్ ట్రాష్ అని అంటాను.. అని అంటే.. మురారీ ముకుందా అనవసరమైన రచ్చ చేయకుండా కిందకు రా అని మూర్తీ అంటుంటే.. సరే నువ్వు చెప్పావు కనుక వస్తున్నా పద అంటుంది. ఇదంతా ప్రభాకర్ వింటాడు.

మామయ్యకు మా ఇద్దరినీ చూసాడా

మురారీ ఇంకా రాలేదు అని అనుకుంటే.. ముకుంద ఏదిరా అని అడుగుతాడు ప్రసాద్.. రూమ్ లో ఉంది. రమ్మన్నాను వచ్చేస్తుంది. అని అంటుంటే.. మీ మామయ్య ఎడి అని అంటే.. కిందే ఉండాలి కదా అని మురారీ సమాధానం చెబుతాడు. లేదు నీ వెనుకనే వచ్చాడు కదా అని మురారీని అడుగుతుంది సుక్కు.. అంటే మా ఇద్దరినీ చూసేసాడా నేను దిక్కులు చూస్తూనే ఉన్నానే అని మురారీ ఆలోచిస్తుంటే.. ఏసీపీ సార్ మీరు ఇటు రండి అని కృష్ణ పిలుస్తుంది. ఇంతలో ప్రభాకర్ వచ్చి అల్లుడు అని పిలుస్తాడు. మా ఇద్దరిని చూసినట్లు ఉన్నాడు.. అడిగితె ఏమి చెప్పాలి అని మురారీ ఆలోచిస్తున్నాడు.

ఇంతలో కృష్ణ అందరూ ఉన్నారు రా అని చిన్నన్నా అని అంటే.. అలుడితో ఒక మాట చెప్పాలి నువ్వు రా అల్లుడు అని మురారిని తీసుకుని వెళ్తుంటే.. ముకుంద .. మా ఇద్దరినీ చూసి ఉంటాడు.. మా విషయం తెలిసి పోయి ఉంటుందా చూద్దాం ఏమి జరుగుతుందో అని అంటుకుంది.

రేపటి ఎపిసోడ్ లో

డీజీ సాంగ్స్ తో సందడి చేసి… గణపతి లడ్డుని వేలం వేస్తారు.. కృష్ణ తో ముకుంద పోటీ పడుతూ తన పాట ఆరు లక్షలు అని అంటుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే