AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త మృతదేహంపై పాము కాట్లు.. అనుమానమొచ్చి పోస్టుమార్టం చేయగా.. వెలుగులోకి షాకింగ్ నిజం!

భర్తను గొంతు నులిమి చంపింది ఓ భార్య. పైగా అతడు పాముకాటుతో చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు బండారం బయటపడింది. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఈ హత్య తీవ్ర సంచలనం రేపింది. ప్రియుడితో కలిసి భర్త అమిత్‌ను భార్య రవిత దారుణంగా హత్య చేసిందని పోలీసులు తెలిపారు.

భర్త మృతదేహంపై పాము కాట్లు.. అనుమానమొచ్చి పోస్టుమార్టం చేయగా.. వెలుగులోకి షాకింగ్ నిజం!
Meerut Snakebite Case
Balaraju Goud
|

Updated on: Apr 17, 2025 | 8:41 PM

Share

భర్తను గొంతు నులిమి చంపింది ఓ భార్య. పైగా అతడు పాముకాటుతో చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు బండారం బయటపడింది. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఈ హత్య తీవ్ర సంచలనం రేపింది. ప్రియుడితో కలిసి భర్త అమిత్‌ను భార్య రవిత దారుణంగా హత్య చేసిందని పోలీసులు తెలిపారు.

ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌ నగరం భర్తల పాలిట శాపంగా మారింది. ప్రియుడి మోజులో భార్య చేతిలో మర్చంట్‌ నేవీ ఆఫీసర్‌ సౌరభ్‌ భరద్వాజ్‌ హత్య ఘటన మరవక ముందే, మరో మర్డర్‌ జరిగింది. రవిత అనే యువతి తన ప్రియుడు అమర్‌జీత్‌తో కలిసి భర్త అమిత్‌ను దారుణంగా హత్య చేసింది. భర్త అమిత్‌ను గొంతు నులిమి చంపిన రవిత పాముకాటుతో చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేసింది. అమిత్‌ శవం పక్కనే పామును పెట్టడంతో స్థానికులు అతడు పాముకాటుతోనే చనిపోయినట్టు భావించారు.

అయితే పోస్ట్‌మార్టమ్‌ నివేదికలో అసలు విషయం బయటపడింది. గొంతునులిమి చంపడంతోనే అమిత్‌ చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు రవితను విచారించినప్పుడు అసలు విషయం వెలుగు లోకి వచ్చింది. రవిత రూ.వెయ్యి ఖర్చు చేసి ఓ పామును కొని తీసుకొచ్చి.. భర్త మృతదేహంపై 10 సార్లు కాట్లు వేయించింది. పాము కరవడం వల్లే అతడు చనిపోయాడని అక్కడున్న వారందరిని నమ్మించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

అయితే.. అతడు పాముకాటు వల్ల చనిపోలేదని గొంతు నులిమేయడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్టులో వెల్లడైంది. దీంతో పోలీసులు రవితనను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు వ్యవహారం బయటపడింది. తనను అమిత్‌ తరచుగా వేధిస్తున్నాడని, అందుకే హత్య చేసినట్టు రవిత వెల్లడించింది. అయితే పామును మాత్రం అమర్‌జీత్‌ తీసుకొచ్చాడని వెల్లడించింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు రవిత, అమర్‌జీత్‌ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో అమిత్‌ మర్డర్‌ మిస్టరీ వీడింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ